ఇంస్టాగ్రామ్ లో చేరిన నాలుగు గంటల్లో పది లక్షల ఫాలోవర్స్... గిన్నీస్ రికార్డ్

ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఒక ప్రచార సాధనంగా మారిపోయింది.ఎంతలా అంటే రాజకీయాలలో పార్టీల గెలుపు, ఓటములని సైతం సోషల్ మీడియానే నిర్ధేశిస్తుంది.

 Fastest Time To Reach 1 Million Followers On Instagram,  David Attenborough, Soc-TeluguStop.com

అందుకే అన్ని రాజకీయ పార్టీలు దీనిని తమ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు.ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా విభాగాన్ని నడుపుతుంది.

పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువ చేయడంతో, విపక్ష పార్టీల మీద ఎదురుదాడి చేయడం, వారి తప్పులని ఎత్తి చూపించడం, అవసరం అయితే పార్టీల మీద విషప్రచారం చేయడం చేస్తున్నారు.అలాగే సెలబ్రెటీలు కూడా తమ ఫేమ్ పెంచుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు.

అలాగే సినిమాతోపాటు సోషల్ మీడియాని తమ ఆదాయ మార్గంగా ఉపయోగించుకుంటున్నారు.సినిమాకి, రాజకీయానికి ఎప్పుడూ కూడా ప్రజల నుంచి విశేషమైన ఆదరణ ఉంటుంది.

అందుకే సినీ, రాజకీయ సెలబ్రెటీలు సోషల్ మీడియాలోకి రాగానే వారిని ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.సెలబ్రెటీలు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టగానే ప్రజలు వెంటనే ఫాలో అవ్వడం మొదలు పెడతారు.

కొంత మంది రాత్రికి రాత్రే వారు పెట్టిన వీడియోల ద్వారానో, పోస్టుల ద్వారానో పాపులర్ అవుతున్నారు.

తాజాగా బ్రిటన్ కు చెందిన దిగ్గజ ప్రసార కర్త డేవిడ్ అట్టేన్ బోరో ఓ అరుదైన ఘనత సాధించారు.

ఆయన అలా ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టారో లేదో ఇలా ఎవరూ ఊహించని రికార్డు అందుకున్నారు.కేవలం నాలుగు గంటల వ్యవధిలో పది లక్షల మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు.

గిన్నీస్ లో ఇప్పటి దాకా జెన్నీఫర్ అనిస్టన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేశారు.అంతలా ఆయన్ని జనం ఫాలో అవడానికి కారణం ఆయన పోస్టు చేసిన వీడియో నచ్చడమే.

మనమంతా భూగోళాన్ని కాపాడుకోవాలని ఆయన ఓ వీడియో అప్ లోడ్ చేయగా దానిని లక్షలాది మంది ఆసక్తిగా వీక్షించారు.ఆ వీడియోను ఇప్పటివరకూ కోటి నలభై లక్షల మంది చూశారు.

దీంతో అట్టేన్ బోరో ఫాలోవర్స్ సంఖ్య కేవలం నాలుగు గంటల్లో పది లక్షల మందికి చేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube