అత్యంత వేగంగా టెస్టులలో హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లు వీళ్లే..!

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా కెరియర్ ప్రారంభించిన ఇషాన్ కిషన్ తొలి ఆఫ్ సెంచరీ తో ఓ అరుదైన రికార్డ్ సాధించాడు.అత్యంత వేగంగా టెస్టులలో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల టాప్-5 జాబితాలో ఇషాన్ కిషన్( Ishan Kishan ) స్థానం దక్కించుకున్నాడు.

 Fastest Half Centuries In Test Cricket Panth Sehwag Kapil Dev Details, Fastest H-TeluguStop.com

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.ఇషాన్ కిషన్ కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.భారత్ తరఫున అత్యంత వేగంగా టెస్టులలో హాఫ్ సెంచరీలు పూర్తిచేసిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

రిషబ్ పంత్:

భారత్ తరపున అత్యంత వేగంగా టెస్టులలో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.2022లో శ్రీలంక – భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్( Rishab Panth ) కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

Telugu Cricket, Ishan Kishan, Kapil Dev, Rishab Pant, Shardul Thakur, Virender S

కపిల్ దేవ్:

ఈ జాబితాలో రెండవ ఆటగాడిగా కపిల్ దేవ్( Kapil Dev ) కొనసాగుతున్నాడు.1982 లో భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆ జాబితాలో రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు.

Telugu Cricket, Ishan Kishan, Kapil Dev, Rishab Pant, Shardul Thakur, Virender S

శార్ధుల్ ఠాకూర్:

ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.2021 లో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఠాకూర్ ( Shardul Thakur ) 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.

Telugu Cricket, Ishan Kishan, Kapil Dev, Rishab Pant, Shardul Thakur, Virender S

వీరేంద్ర సెహ్వాగ్:

భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virendra Sehwag ) ఆ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచాడు.2008లో ఇంగ్లాండ్- భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో కేవలం 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

Telugu Cricket, Ishan Kishan, Kapil Dev, Rishab Pant, Shardul Thakur, Virender S

ఇషాన్ కిషన్:

తాజాగా వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కేవలం 33 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి భారత్ తరపున అత్యంత వేగంగా అర్థ సెంచరీ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఐదవ స్థానానికి చేరుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube