పాతవాహనాలు, థర్డ్ పార్టీ వాహన భీమా కొనుగోలుకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి..!

అవును.పాత వాహనాలు, థర్డ్ పార్టీ వాహన భీమా కొనుగోలుకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అంటుంది.రోడ్డు రవాణా శాఖ.రోడ్డు మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.2017 డిసెంబర్ 1 లోపు విక్రయించిన పాత వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అంటూ.ఓ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Fastag Mandatory For Vehicles Sold Before December 2017,fastag, Vehilces, Decemb-TeluguStop.com

ఈ క్రమంలోనే కొత్త థర్డ్ పార్టీ మోటారు వాహన భీమాను కొనుగోలు చేయడానికి కూడా ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయాలని ఈ ముసాయిదాలో పేర్కొనడం గమనార్హం.

ఇదే కనుక అమలు చేస్తే… కొత్త నిబంధనలు వచ్చే సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి.

ఈ మేరకు నిన్న గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.అది ఈ విధంగా వుంది.

డిసెంబర్ 1, 2017 లోపు అమ్మిన పాత వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయడంపై వాటాదారుల అభిప్రాయాలు, సూచనలు కోరేందుకు గానూ… 2020 సెప్టెంబర్ 1 వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జీఎస్ఆర్ 541 (ఈ) ను విడుదల చేసింది.ఇందులో సవరించిన నిబంధన జనవరి 2021 నుండి అమలులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు.
ఇకపోతే.కొత్త 4- వీలర్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం 2017 నుండి ఫాస్ట్ ట్యాగ్‌ను తప్పనిసరి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అలాగే ఫాస్ట్ ట్యాగ్ లేనివారు టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు.వాహనదారులకు ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్‌ ఇవ్వాలని NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇటీవలే నిర్ణయించింది.

ఇందులో భాగంగా ప్రతీ అకౌంట్‌కు సెక్యూరిటీ డిపాజిట్ కూడా లభించనుంది.వాహనదారులు ఎలక్ట్రానిక్ టోల్ పద్ధతికి మారేందుకు ఈ నిర్ణయం తీసుకుంది NHAI.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube