చిత్రం : ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడిస్ టైలర్
బ్యానర్ : మధుర ప్రొడక్షన్స్
దర్శకత్వం : వంశీ
నిర్మాత : మధుర శ్రీధర్
సంగీతం : మణిశర్మ
విడుదల తేది : జూన్ 1, 2017
నటీనటులు – సుమంత్ అశ్విన్
1986 వచ్చిన లేడీస్ టైలర్ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే.రాజేంద్రప్రసాద్ హీరోగా, వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ కమెడి క్లాసిక్ నిలిచింది.
మరి ఇన్నాళ్ళకు సీక్వెల్ గా వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడిస్ టైలర్ ప్రిక్వేల్ రెంజ్ లో ఉందా లేదా చూడండి.
కథలోకి వెళితే :
గోపాలం (సుమంత్ అశ్విన్) ఊరిలో ఉన్న ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్.తన చేతికి మన్మథ రేఖ ఉందని తెలుసుకోని ఊరిలో ఉన్న ధనవంతులైన అమ్మాయిలని పడేయాలని చూస్తాడు.ఆ క్రమంలోనే రాణి (మానస), అమ్ములు (మనాలి రాథోడ్) ని ప్రయత్నిస్తాడు గోపాలం.
కాని మహాలక్ష్మీ (అనీషా ఆంబ్రోస్) విషయానికి వచ్చేసరికి కథ కొన్ని మలుపులు తిరుగుతుంది.అవేంటో తెర మీదే చూడండి.
నటీనటుల నటన :
లేడిస్ టైలర్ అభిమానులు అలాంటి పాత్రలో రాజేంద్రప్రసాద్ కి బదులుగా సుమంత్ అశ్విన్ ని ఊహించుకోవడం కొంచెం కష్టమైన విషయమే.ఇక సినిమా చూసిన తరువాత ఆ కష్టాలు పెరిగిపోతాయి.
ఎక్కడా కూడా తనకు నప్పని పాత్ర చేసాడు సుమంత్.ఈ సినిమా తన కెరీర్ కి పెద్ద మైనస్ పాయింట్ అయ్యే అవకాశాలే ఎక్కువ.
ఉన్న హీరోయిన్లలో మానస చాలా బెటర్.ఎన్నోకొన్ని హావాభావాలు పలికించగలిగింది.
మనాలి రాథోడ్ కేవలం గ్లామర్ కే పనికొచ్చింది.కాని బరువెక్కిన ఆ అందాలను చూడ్డానికి కూడా ప్రేక్షకుడు పెద్దగా ఆసక్తి చూపించడేమో.
అనీషా నటపరంగా మెప్పించలేకపోయినా, గ్లామరస్ హీరోయిన్ గా ఓ మార్కు వేసుకుంటుంది.కృష్ణభగవాన్ కామెడి ఎక్కడ పేలుతుందో, ఎక్కడ పేలదో చెప్పలేం.
టెక్నికల్ టీమ్ :
ఈ సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది సినిమాటోగ్రాఫి.పల్లేటూరి అందాలకు మంచి ఫ్రెమింగ్ ఇచ్చారు.
కాని పాటల కొరియోగ్రాఫి వలన అక్కడ సినిమాటోగ్రాఫి పూర్తిగా తేలిపోతుంది.మణిశర్మ బాణీలు అకట్టుకోవు.
ఒక్క పాట కూడా రిజిస్టర్ అవదు.నేపథ్య సంగీతం ఫర్వాలేదు.
ఎడిటింగ్ షార్ట్ ఫిలిమ్స్ లో ఇంతకంటే బాగుంటుంది.ఎక్కడ ఏ సీన్ ని అతికిస్తున్నారో ఎడిటింగ్ డిపార్టుమెంటుకి అస్సలు అర్థం కాలేదు అనుకుంటా.
ఈ సైజు సినిమాకి ఈ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
విశ్లేషణ :
కొందరు దర్శకులు తమకంటూ ఓ మార్కు క్రియేట్ చేసుకుంటారు.పూరి జగన్నాథ్ హీరోలు ఆరోగెంట్ గా ఉంటారు, అదో మార్కు.అలాగే వంశీ సినిమాల్లో స్లాప్ స్టిక్ కామెడి ఉంటుంది.ఆయనదో మార్కు.ఆ మార్కుతోనే అప్పట్లో కొన్ని క్లాసిక్స్ ఇచ్చారు.
కాని సమయానికి తగ్గట్టుగా స్టయిల్ మార్చుకోకుండా, అదే మూసలో ఉండిపోతే దాన్ని పైత్యం అని అంటారు.ఆ పైత్యానికి పరాకాష్ఠ ఈ ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడిస్ టైలర్.
అతికించిన బొంతలా ఉంది సినిమా.సీన్స్ లో కంటిన్యూటి ఉండదు.
పాత్రల్లో బలం ఉండదు.రాసిన డైలాగుల్లో కామెడి ఉండదు.
ఇచ్చిన A సర్టిఫికెట్ కి హీరోయిన్ల నడుమందాలు మాటిమాటికి చూపించినా, వాటికోసమే వెళ్ళడుగా ప్రేక్షకుడు.ఇదంతా కాదు కాని ఒక్కమాటలో చెప్పాలంటే, లేడిస్ టైలర్ కామెడి సినిమాల్లో క్లాసిక్ అయితే, ఈ ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడిస్ టైలర్ అస్సలు బాగా తీయని సినిమాల్లో క్లాసిక్.
ప్లస్ పాయింట్స్ :
* సినిమాటోగ్రాఫి
మైనస్ పాయింట్స్ :
* వంశీ టేకింగ్
* పాటలు
* ఎడిటింగ్
* ఇంకెన్నో
చివరగా :
అదోరకం