నిజామాబాద్ లో రైతుల ఆందోళన ఉదృతం! నాగపూర్ హైవేపై బైఠాయింపు!

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్ పరిధిలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న మొక్కజొన్న పసుపు రైతుల ఆందోళన తీవ్రతరం అయింది.మొక్కజొన్న పసుపు పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు.

 Farmers Serious Agitation In Nizamabad District-TeluguStop.com

అయితే ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడంతో రైతుల ఆందోళన తీవ్రతరం చేశారు.తాజాగా నాగపూర్ హైవే లో తెల్లవార్లు ఏ మాత్రం కదలకుండా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

వాహనాల రాకపోకలు అడ్డుకొని, రోడ్డుపై బైఠాయించిన రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తున్నారు.పంటకు గిట్టుబాటు ధర చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చేంత వరకు తమ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని ఆర్మూరు రైతులు అంటున్నారు.

అయితే రైతుల ఆందోళన విరమింప చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube