వైరల్.. ఆ ఊరిలో వింత ఆచారం..పెళ్ళి ఇలా చేస్తే..!

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం పాటిస్తూ ఉంటారు.ఎన్నో ఏళ్లగా అక్కడి ప్రజలు వాళ్ళ ఆచారాలను పాటిస్తూ ఉంటారు.

 Farmers Perform Wedding Of Donkeys-TeluguStop.com

టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా కొన్ని మూఢ నమ్మకాలను ప్రజలు వదిలి పెట్టడం లేదు.వాటిని వాళ్ళ ఆచారాలలో ఒక భాగం చేసుకుని ఇప్పటికి పాటిస్తూ ఉంటారు.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆచారమే ఒక పాటిస్తున్నారు.

 Farmers Perform Wedding Of Donkeys-వైరల్.. ఆ ఊరిలో వింత ఆచారం..పెళ్ళి ఇలా చేస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కర్నూలు జిల్లాలో ప్రజలు ఒక వింత చారాన్ని పాటిస్తున్నారు.

అక్కడ ప్రజలు పెళ్లిని ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు.అందుకే వారు ఆ మూఢ నమ్మకాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అక్కడ ప్రజలు గాడిదలకు పెళ్లి చేసారు.సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి అందరు బాగుండాలని ఆ ఊరిలో వసుదేవ కళ్యాణం జరిపించారు.

వసుదేవ కళ్యాణం అంటే గాడిదలకు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించడం.తర్వాత ఆ గాడిదలను ఊరంతా ఉరేగించాలి.

ఆ ఊరిలో వర్షాలు కురవక పంటలు ఎండిపోవడంతో అక్కడి రైతులు ఇలా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని అలా కళ్యాణం జరిపించారు.అయితే ఈ పెళ్లి కూడా అచ్చం మనుషుల పెళ్లి లాగానే జరిపించాలి.

ఇక్కడ ప్రజలు గతంలో కూడా ఇలాగె పెళ్లి జరిపిస్తే వర్షాలు కురిశాయని అందుకే ఇప్పుడు మళ్ళీ ఇలానే పెళ్లి జరిపిస్తున్నామని వారు తెలిపారు.ఇలా వాళ్ళ ఊరిలో వర్షాల బాగా పడి పంటలు చక్కగా పండాలని అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వసుదేవ కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా అక్కడి ప్రజలు జరిపించారు.

ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

#Kurnool #Pattikonda #AP #FarmersPerm #Donkey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు