ఆ 12 గ్రామాల్లో రైతులు ఉల్లిని అస్సలు పండించరట... ఎందుకంటే?

అవును, మీరు విన్నది నిజమే.ఆ 12 గ్రామాల్లో రైతులు ఉల్లిని అస్సలు పండించరు.

 Farmers In Those 12 Villages Do Not Grow Onion At All Because, Onion, Farming, N-TeluguStop.com

టెక్నాలజీ ( Technology )అంతకంతకూ పెరిగి, మనిషి అభివృద్ధి ప్రధంలో నడుస్తున్నవేళ, కొన్ని ప్రాంతాలలో ప్రజలు మూఢనమ్మకాలను ఇంకా పాటిస్తూ భయపడుతూనే వున్నారు.సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా మారుమూల పల్లెల్లో మనకి కనిపిస్తాయి.

ఆరోగ్యం బాగాలేకపోతే.డాక్టర్ కు బదులు, మాంత్రికులను, భూతవైద్యులను నమ్మడం వారికి తరతరాలనుండి వచ్చింది.

మరికొన్ని చోట్ల అనాదీగా ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి.

కొన్ని చోట్ల వీటికి సరైన కారణాలు ఉంటాయి.మరికొన్ని చోట్ల మాత్రం వారు చెప్పే కారణాలు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి.తాజాగా, ఇలాంటి మూఢ నమ్మకానికి ఘటన వార్తలలో నిలిచింది.

వివరాల్లోకి వెళితే, బీహార్లో ( Bihar )ఇప్పటికి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డెవలప్ మెంట్ కాస్త వెనుకబడి ఉంది.ఇప్పటికి అక్కడ మూఢ నమ్మకాల ఘటనలు, దాడులు, హత్యల వంటి తరచుగా జరుగుతుండడం బాధాకరం.

ఈ క్రమంలో నలందా పరిధిలోని గిరియాక్ బ్లాక్ రైతార్( Giriak Black Raitar ) పరిధిలోని 12 గ్రామాల్లో చాలా ఏళ్లుగా ఉల్లి సాగు చేయడం లేదట.

అవును, అయితే వారు అక్కడ ఉల్లిని పండించడానికి ఎన్నో పయత్నాలు చేసి ఆఖరికి విరమించుకున్నారు.అయితే దానికి వారు చెబుతున్న కారణం అయితే చాలా దారుణంగా వుంది.అక్కడి రైతులు అక్కడ ఉల్లి( onion )ని సాగుచేసిన ప్రతిసారీ వారికి ప్రమాదం జరిగేదట.

దానికి బీజం పడింది మాత్రం శతాబ్దం క్రితం అంట.ఈ ప్రదేశంలో అప్పట్లో ఒక బాబా ‘బనౌత్’( Banout ) అనే సాధువు జీవించేవారని గ్రామస్థులు చెబుతున్నారు.అతను స్వచ్ఛమైన శాఖాహారుడు.కాబట్టి అతను ఉల్లి, వెల్లుల్లి తినేవాడు కాదట.దీంతో గ్రామస్తులు అప్పటినుండి సాగు చేయడమే మానేశారట.దానిని అతిక్రమించి ఎవరైనా ఒకవేళ పండించుట ఏదోఒక రూపంలో వారికి ప్రమాదం సంభవించేదట.

వినడానికి చాలా విడ్డురంగా వుంది కదా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube