ఇదేందయ్యా ఇది: గేదెలకూ ఫేస్ మాస్క్‌లంట...!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ విధంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ప్రతి రోజు కూడా అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

 Farmer Puts Face Masks To His Buffaloes , Farmers, Buffaloes,face Masks, Buffalo-TeluguStop.com

కేవలం కరోనా పాజిటివ్ కేసులు నగరాలు, పట్టణాలే కాదు గ్రామాలలో కూడా అలానే ఉంది పరిస్థితి.ఈ తరుణంలో రైతులు సైతం తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు.

తాము మాస్క్ దరిస్తూనే, తమ పశువుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఓ రైతు తన గేదెలకు మాస్కులు పెడుతున్నాడు.

ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామానికి చెందిన అన్నవరం అనే ఒక వైపు రైతు పంట పొలాలు చూసుకుంటూనే, గేదెలను కూడా ఆయన పోషిస్తున్నారు.

నిజానికి గేదలు అంటే అతను చాలా ఇష్టం.అతను అవి ఇచ్చే పాలతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉండగా ప్రస్తుతం జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉడడంతో ఆ రైతు అప్రమత్తం అయ్యాడు.తాను జాగ్రత్తలు పడుతూ… తన గేదెల ఆరోగ్యంపై కూడా దృష్టి కొనసాగించి వాటిని కాపాడుకునేందుకు మాస్కులు ఉపయోగిస్తున్నారు.

దీనితో గేదె ముఖానికి సరిపోయే సైజులో ప్రత్యేకంగా మాస్కులు తయారు చేయించి మరీ వాటిని గేదెల ముఖానికి తొడిగాడు.ఇక గేదెలు కుడితి మేత సమయంలో తప్ప మిగతా సమయం అంతా కూడా గేదెలకు కచ్చితంగా మాస్కులు ఉండేలాగా జాగ్రత్త పడుతున్నాడు.

ఎంతైనా సొంత బిడ్డలా చూసుకొనే వాటిని ఇలా చూసుకోవడం నిజంగా మంచి పని చేస్తున్న రైతును అభిందించకుండా ఉండలేము.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube