శునకాన్ని పులిగా మార్చేసిన రైతు! సోషల్ మీడియాలో వైరల్  

Farmer Paints Dog To Look Like Tiger-karnataka,shivamogga

కోతులు, పక్షుల నుంచి పంటలని కాపాడుకోవడానికి రైతులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.తమ పంట పొలాల్లో దిష్టిబొమ్మలు పెట్టడం, అలాగే దెయ్యాలలా బొమ్మలు తయారు చేసి పెట్టడం, అలాగే జంతువుల బొమ్మలని కూడా పెట్టడం చేస్తూ ఉంటారు.అలాగే ఓ రైతు కూడా కోతుల నుంచి తన పంటని కాపాడుకోవడానికి కొత్తగా ఆలోచించి పొలంలో పులి బొమ్మ పెట్టాడు.దాంతో కోతులు అటువైపు రావడం మానేశాయి.

Farmer Paints Dog To Look Like Tiger-karnataka,shivamogga Telugu Viral News Farmer Paints Dog To Look Like Tiger-karnataka Shivamogga-Farmer Paints Dog To Look Like Tiger-Karnataka Shivamogga

అలాగే మరో పొలంలో కూడా పులిబొమ్మ పెట్టాడు.అక్కడ కూడా కోతులు రాకని తగ్గించాయి.అయితే ఈ సారి మరింత కొత్తగా ఆలోచించాడు.బొమ్మలని పెడితే కోతులు ఏదో ఒక రోజు పసిగట్టేస్తాయి అని భావించిన రైతులు ఈ సారి తన పెంపుడు కుక్కని పులిలా తయారు చేసేసాడు.

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో నాలూరు గ్రామంలో జరిగింది.శ్రీకాంత్ గౌడ అనే తన పెంపుడు కుక్కకు పులివేషం వేస్తే ఇంకెలా ఉంటుందో కదా అని ఆలోచించాడు.వెంటనే కుక్కకు పులిచారలను తలపించేలా రంగులు వేశాడు.దాంతో ఆ కుక్క చూడ్డానికి అచ్చం పులిలా తయారైంది.

పెయింట్ కారణంగా కుక్క చర్మం పాడవుతుందనే ఉద్దేశంతో కొంతకాలం నుంచి దానికి హెయిర్ డైలు ఉపయోగించి రంగులు వేయడం మొదలుపెట్టాడు.ఇప్పుడా పులి కుక్క కనిపిస్తే చాలు కోతులు పరార్! ఇది చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా శ్రీకాంత్ గౌడని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి అతనికి వచ్చిన ఆలోచన ఇప్పుడు రైతులందరికీ ఉపయోగపడుతుంది.ఇదిలా ఉంటే ఈ పులా మారిన శునకంకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎవరో పెట్టడం అవి ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.