విమానాశ్ర‌యంలో రైతు వ్య‌వ‌సాయం.. 12 కోట్లు ఇస్తామ‌న్నా ఒప్పుకోలేదు!

ప్రస్తుత కాలంలో మనుషులందరూ చేసే పనికి విలువ ఇవ్వడం లేదు.కానీ వ్యవసాయం చేసే ప్రతీ రైతు వ్యవసాయానికి ఎంతో విలువ ఇస్తాడు.

 Farmer Lives In The Middle Of Japan S Narita Airport  Farmer, Japan, Narita Airp-TeluguStop.com

భూదేవత చల్లని చూపు చూస్తూనే ఎంతో ఆనందంగా ఉంటాము అని వారి భూమిని చూసి మురిసిపోతారు.చివరకు అదే భూమిలో కలిసిపోతారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ రైతు గురించి అతను భూమికి ఇచ్చే విలువ గురించి తెలుసుకుందాం.

సాధారణంగా తల్లితండ్రులు రైతులు అయినప్పటికి పిల్లలను బాగా చదివిస్తారు.

దీంతో మంచి ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు అక్కడే స్థిరపడిపోతారు.తండ్రి వ్యవసాయ వృత్తిని ఎవరూ కొనసాగించరు.

కానీ జపాన్‌లో ఓ వ్యక్తి మూడు తరాలు కూర్చొని తినే సిరి సంపదలు ఇస్తాం అని చెప్పినా సరే ఆ నేలను అమ్మడానికి ఒప్పుకోలేదు.

చుట్టూ విమానాలు, అధికారులు ఉన్నా ఏమాత్రం భయపడకుండా విమానాశ్ర‌యం మ‌ధ్య‌లో పొలం దున్నుతున్నాడు.

జపాన్‌లోనే రెండో అదిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా న‌రితా ఎయిర్‌పోర్టుకు పేరు ఉంది.ఇక్కడ కొన్ని లక్షలమంది విమానాశ్రయం నుంచి ప్రయాణం చేస్తుంటారు.దీంతో 1970లోనే ప్రభుత్వం నరితా విమానాశ్రయాన్ని విస్తరించాలని నిర్ణయించుకుంది.

చుట్టూ ఉన్న స్థలాన్ని మొత్తం అక్కడ నివసించే ప్రజలకు భారీ పరిహారం ఇచ్చి వారి భూములను సొంతం చేసుకున్నారు.

కానీ అక్కడ నివసించే ట‌కావో షిటో అనే రైతు మాత్రం పొలాన్ని అమ్మడానికి ఒప్పుకోలేదు.అది వారసత్వ భూమి అని, అక్కడ వ్యవసాయమే చెయ్యాలని, అతని తర్వాత కూడా వారి తర్వాత తరాలకు చెందాలి కానీ ఇలా విమానాశ్రయానికి ఇచ్చే అవకాశం లేదని పట్టుబట్టి కూర్చున్నాడు.కాగా విమానాశ్ర‌య నిర్మాణానికి ఆ పొలం కోసం రూ.12,67,39,329 ఆఫర్ ఇచ్చినా సరే నిరాకరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube