అన్నదాతలకు శుభవార్త: ష్యూరిటీ లేకుండా రైతులకు రుణాలు..!

భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం చేసి జీవనం కొనసాగించేవారు.ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను రైతులకు చేరవేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Farmer, Kisan Credit Card, Bank, Loan, Interest, Low Interest, India, Government-TeluguStop.com

ఇకపోతే తాజాగా భారతదేశంలోని రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం ప్రారంభించింది.ఈ స్కీం ద్వారా రైతులు అతి తక్కువ వడ్డీకే లోను పొందవచ్చు.

బయట మార్కెట్లో ఎక్కువ వడ్డీకి తీసుకునే బదులు బ్యాంకులలో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చు.

ఇక ఈ స్కీం కింద ఏకంగా ఎలాంటి షూరిటీ లేకుండా రైతుకు 1.6 లక్షల వరకు లోను పొందవచ్చు.అంతేకాదు ఈ లోను తీసుకున్నందుకు పంటకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభించనుంది.

ఇక తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా అతి సులభంగా ఇచ్చారు.మార్కెటింగ్, పంట కోతలు లాంటి వాటిని అనుసరించి అప్పు తిరిగి చెల్లించేందుకు వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం.

ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలాంటి పొలం ఉన్న రైతు అయినా సరే పొందవచ్చు.వీటి కోసం వారి ప్రాంతంలో ఉండే బ్యాంకుల ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఒక వీటి కోసం పంట ఉత్పత్తి, ఇతర కార్యకలాపాల వంటి వాటిని బట్టి కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు.ఇప్పటికే 25 లక్షలకు పైగా కిసాన్ క్రెడిట్ కార్డులను భారతదేశ ప్రభుత్వం జారీ చేసింది.ఇదివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల కోట్లు ప్యాకేజీలో 2.5 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా ఈ క్రెడిట్ కార్డులను అందజేయనున్నారు.ఈ క్రెడిట్ కావలసిన రైతులు వారి ఆధార్ కార్డ్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు, యూఐడీఏఐ జారీ చేసిన పత్రాలు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కచ్చితంగా అవసరం.ఇవన్నీ మీకు దగ్గరలోని బ్యాంకు కి తీసుకువెళ్లి అందిస్తే ఆ డాక్యుమెంట్స్ ను సరిచూసుకొని కిసాన్ క్రెడిట్ కార్డ్ ను మీకు అందజేస్తారు.

ఈ మొత్తం విధానంలో బ్యాంకు సిబ్బంది సహకారం ఖచ్చితం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube