ఓ రైతు ఆలోచనకి ఫిదా అయిన నెటిజన్స్! సోషల్ మీడియాలో ప్రశంసలు  

Farmer Invents Bike Trolley For Transportation-

ఆలోచన ఉండాలే కాని ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదు.ఈ విషయాన్ని ఎంతో మంది మేధావులు నిరూపించారు.ఇప్పటికి నిరూపిస్తున్నారు..

Farmer Invents Bike Trolley For Transportation--Farmer Invents Bike Trolley For Transportation-

తన ఆలోచనలకి పదును పెట్టి అద్బుతాలు ఆవిష్కరిస్తున్నారు.అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి చూపిస్తున్నారు.ఇక రైతులు అంటే వ్యవసాయం తప్ప వారికి ఇంకేం తెలియదు అనేవారికి ఓ రైతు తన వినూత్న ఆలోచనతో ఆశ్చర్యం కలిగించాడు.

తన అవసారాల కోసం ఓ బైక్ కి ఏకంగా చిన్న సైజు ట్రాలీ సాయంతో ట్రాక్టర్ తరహాలో తయారు చేసేసాడు.ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ రైతు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు.

నిజామాబాద్ జిల్లాకి చెందిన రెంజల్ భాస్కర్ రెడ్డి అనే రైతు తన వ్యవసాయం కోసం ట్రాక్టర్ కొనే ఆర్థిక స్తోమత లేకపోవడంతో నిత్యం పొలం పనుల కోసం కూలీలను ఆటోలో తీసుకెళ్లడం భారమింది.

ఆదాయం కంటే కూలీల కోసం పెట్టిన ఖర్చు ఎక్కువగా ఉండేది.దీంతో అతనికి ఒక ఆలోచన వచ్చింది.అందులోంచి పుట్టిందే మినీ ట్రాలీ పుట్టుకొచ్చింది.

20వేల ఖర్చుతో బైక్ ను ట్రాక్టర్ గా మార్చాడు భాస్కర్ రెడ్డి.బైక్ ట్రాలీతో కేవలం కూలీలల్ని మాత్రమే కాకుండా ఎరువుల బస్తాలనూ కూడా ఈ రైతు తరలిస్తున్నాడు.ఐదు క్వీంటాల్ బరువు మోసేలా తయారు చేసుకున్న ఈ ట్రాలీలో ఏకంగా 6 నుంచి ఎనిమిది మంది కూలీలని తరలించవచ్చు.ఈ వినూత్న ఆలోచనతో పుట్టుకొచ్చిన మినీ ట్రాలీ తరహాలో తాము కూడా తయారు చేసుకోవడానికి చుట్టు పక్కల రైతులు ఇప్పుడు భాస్కర రెడ్డి దగ్గరకి వెళ్ళడం విశేషం.