కృష్ణా జిల్లాలో కనిపించిన అరుదైన పునుగు పిల్లి..!

కృష్ణా జిల్లాలో అరుదైన పునుగుపిల్లి ప్రత్యక్షమైంది.ఈ పిల్లిని చూడటానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకుని దానిని జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు.

 Farmer Find Punugu Pilli In Agricultural Land At Krishna District, Farmer, Punug-TeluguStop.com

ఈ పునుగుపిల్లి చాలా అరుదైన జాతి.అంతరించిపోయే జాతులలో పునుగుపిల్లి కూడా ఉంది.

ఈ పునుగుపిల్లి శేషాచలం, నల్లమల్ల అటవీ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి.ఇంత అరుదైన ఈ పిల్లి కృష్ణా జిల్లాలో ప్రత్యక్షమైంది.

తోట్ల వల్లూరు మండలం దేవరపల్లికి చెందిన జొన్నల వెంకటరెడ్డి అనే రైతు పొలం కృష్ణా నది ఒడ్డున ఉండడంతో పంట పొలాలకు నీరు పెట్టేందుకు తోటకి వెళ్ళాడు.ఆయన మోటార్ దగ్గరకు వెళ్లగానే అక్కడున్న వరులలో ఈ అరుదైన పునుగుపిల్లి కనిపించింది.

అయితే రైతు వెంకటరెడ్డి గ్రామస్థుల సహాయంతో జాగ్రత్తగా ఆ పునుగుపిల్లిని పట్టుకుని ఒక బోనులో బంధించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ పునుగు పిల్లి జాతి ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉందని అటవీ అధికారులు తెలియజేశారు.

ఈ పిల్లి ప్రత్యేకతను గురించి కూడా వారు వివరించారు.ఈ పునుగు పిల్లిని ఇంగ్లీష్ లో సివెట్, టాడీ క్యాట్ అని పిలుస్తారు.

ఈ పిల్లి తన శరీరం ద్వారా వచ్చే చెమట ఆరిపోయాక దాని చర్మం పై ఒక తైలంలా అంటుకుని ఉంటుంది.ఈ తైలం ఎంతో సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది.

సుగంధ పరిమళాలు వెదజల్లే ఈ పునుగు పిల్లి తైలాన్ని సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఉపయోగిస్తారు.

ఈ పునుగుపిల్లి ని ఒక ఇనుప జల్లెడలో ఉంచి వాటిలో చందనపు కర్రను నిలబెడతారు.

తన శరీరం ద్వారా విడుదలయ్యే చెమట కొద్దిసేపటికి ఆరిపోయి దాని చర్మం పై అంటుకుంటుంది.అయితే జల్లెడలో ఉంచిన చందనపు కర్రకు దాని చర్మాన్ని తాకడం ద్వారా ఆ తైలం కర్రకు అంటుకుంటుంది.

ఈ విధంగా పునుగుపిల్లి నుంచి తైలాన్ని సేకరిస్తారు.ఈ తైలం కోసం తిరుమల గోశాలలో వీటిని పెంచుతున్నారు.

వీటి ద్వారా వచ్చే సుగంధ పరిమళాలతో కూడిన ఈ తైలాన్ని స్వామివారి అభిషేకం తర్వాత విగ్రహానికి పూస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube