వ్యవసాయ బిల్లుపై సభలో రణరంగం…!  

Farm bills passed by Voice vote in Rajya sabha, Rajya sabha, Farm Bills, Voice vote, Harivansh , Tiruchi Siva, Oppositions, NDA Govt - Telugu Farm Bills, Farm Bills Passed By Voice Vote In Rajya Sabha, Harivansh, Nda Govt, Oppositions, Rajya Sabha, Tiruchi Siva, Voice Vote

సభలో వ్యవసాయబిల్లులపై రణరంగమే నెలకొంది.సభలో విపక్షాల అరుపులు,కేకలు,నినాదాలతో సభ మొత్తం రసాభాస గా మారిపోయింది.

TeluguStop.com - Farm Bill Rajyasabha Voice Vote

కేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులతో ఆదివారంనాడు రాజ్యసభ హోరెత్తిపోయింది.దాదాపు మూడున్నర గంటలపాటు సభ రణరంగాన్ని తలపించింది.2010 మార్చి 9 న యూపీఏ సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఎలా మార్షల్స్ ను దింపి వ్యూహాత్మకంగా వ్యవహరించిందో దాదాపు అదే తరహా లో ఎన్డీయే సర్కార్ ఈ వ్యవసాయ బిల్లులపై వ్యవహరించింది.ఈ బిల్లులను అడ్డుకోవడానికి విపక్షాలు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ కేంద్రం మాత్రం మూజువాణి ఓటు మార్గాన్నే ఎంచుకుని ఓటింగ్‌కు అనుమతించలేదు.

సభలో బలం ఉన్నప్పటికీ ఎన్డీయే సర్కార్ మాత్రం మూజువాణి ఓటు మార్గం నే ఎన్నుకొని ఈ బిల్లులను పాస్ చేయడం లో విజయవంతమైంది.ఇది విపక్షాలకు తీవ్ర ఆగ్రహనికి కారణమైంది.

TeluguStop.com - వ్యవసాయ బిల్లుపై సభలో రణరంగం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, కాంగ్రెస్‌, సీపీఎం సభ్యులు సభ మధ్యలోకి దూసుకొచ్చి- ఓ దశలో స్పీకర్‌ పోడియంపైకి కూడా ఎక్కడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో సభ నిర్వహిస్తున్న ఉపసభాపతి హరివంశ్‌దగ్గరకు – తృణమూల్‌ నేత డెరిక్‌ ఒబ్రెయిన్‌ వచ్చి సభా నియమాలకు సంబంధించిన పుస్తకాన్ని అటూ ఇటూ ఊపి- చించి, ఆయనపైకి విసిరేశారు.

అది హరివంశ్‌కు తగలకుండా మార్షల్స్‌ అడ్డుకున్నారు.ఇక డీఎంకే సభ్యుడు తిరుచి శివ– బిల్లు పత్రాల్ని చించేసి విసిరేశారు.

ఇలా ఆదివారం జరిగిన సభ రసాభాసగా మారింది.

#Farm Bills #NDA Govt #Voice Vote #FarmBills #Rajya Sabha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Farm Bill Rajyasabha Voice Vote Related Telugu News,Photos/Pics,Images..