హాట్ ఫోటో షేర్ చేసిన ఫరియా అబ్దుల్లా.. అవాక్కైన నెటిజన్లు...!

కేవీ అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాలో నటించి ఫరియా అబ్దుల్లా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు.అద్భుతమైన కామెడీ టైమింగ్ తో చిట్టి అనే పాత్రలో నటించి నటనతో ఫరియా మెప్పించారు.

 Faria Abdulla Hot Photo Goes Viral In Social Media, Faria Abdulla,jathi Ratnalu-TeluguStop.com

జాతిరత్నాలు సినిమా తర్వాత ఫరియాకు కొత్త సినిమా ఆఫర్లు బాగనే వస్తున్నా ఫరియా మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది.
అయితే జాతిరత్నాలు సినిమాలో పద్ధతిగా కనిపించిన ఈ హైదరాబాద్ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోను షేర్ చేశారు.

జాతిరత్నాలు సినిమాకు ముందు ఫరియా అబ్దుల్లా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.మరోవైపు మరీ ఎత్తుగా కనిపించడం కూడా ఫరియా కెరీర్ కు మైనస్ గా మారిందని హైట్ వల్లే ఫరియాకు అనుకున్న స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

ఈ హీరోయిన్ గ్లామరస్ రోల్స్ కు కూడా దూరంగా ఉంటారనే ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను చూసి దర్శకనిర్మాతలు ఫరియాకు ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు స్టార్ హీరోలు ఫరియాను పట్టించుకోవడం లేదు.

ఉప్పెన సినిమాతో హిట్ అందుకున్న కృతిశెట్టి వరుస ఆఫర్లతో బిజీ అవుతుంటే ఫరియా మాత్రం ఖాళీగా ఉండటం గమనార్హం.

మరోవైపు జాతిరత్నాలు సినిమాతో హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టితో పాటు ఆ సినిమాలో నటించిన ప్రియదర్శై, రాహుల్ రామకృష్ణలకు కొత్త సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.

కొత్త సినిమా ఆఫర్లు వస్తే మాత్రం ఫరియా అబ్దుల్లా రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube