'మహర్షి' గురించి అసక్తికర అప్‌డేట్‌ ఫ్యాన్స్‌ కోసం  

Farewell Update Of \'maharshi\'-

మహేష్‌ బాబు 25వ చిత్రం మహర్షి విడుదలైన రోజు మిశ్రమ స్పందన దక్కించుకుంది. విచిత్రంగా రివ్యూలు కూడా మిశ్రమంగా వచ్చాయి. చాలా విభిన్నమైన టాక్‌ వచ్చిన నేపథ్యంలో కలెక్షన్స్‌ నార్మల్‌గా ఉంటాయని ట్రేడ్‌ వర్గాల వారు సైతం భావించారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 100 కోట్లను రాబట్టింది. వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వసూళ్లు చేసిన ఈ చిత్రం మరి కొన్ని రోజుల్లో వంద కోట్ల షేర్‌ను సైతం దక్కించుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు..

'మహర్షి' గురించి అసక్తికర అప్‌డేట్‌ ఫ్యాన్స్‌ కోసం-Farewell Update Of 'Maharshi'

భారీ అంచనాలున్న ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం వసూళ్లను రాబట్టేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

సహజంగా ఇలాంటి టాక్‌ వచ్చిన సినిమాలకు కొన్ని సీన్స్‌ జత చేయడం వంటివి చేస్తారు.

అలాగే మహర్షి చిత్రం కోసం కూడా ఇలా సీన్స్‌ను యాడ్‌ చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రెండవ వారం నుండి కొత్తగా పది నిమిషాల సీన్స్‌ను జత చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే సినిమా మూడు గంటలు ఉంది.

ఈమద్య కాలంలో మూడు గంటల సినిమా అంటే రికార్డు అనుకోవాలి. మూడు గంటలు ఉండి కూడా సినిమా పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుని భారీ వసూళ్లను రాబడుతుంది.

ఇలాంటి సమయంలో ఇంకా పది నిమిషాల సీన్స్‌ను యాడ్‌ చేయడం అంటే మామూలు సాహసం కాదు. ఇది చాలా సాహస నిర్ణయంగా చెబుతున్నారు.

మూడు గంటలకు మించి సినిమా ఉంటే బాబోయ్‌ అన్నట్లుగా ఉంటుంది. అయితే సినిమా ఆసక్తికరంగా సాగితే మూడు గంటలకు మించి ఉన్నా పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. అందుకే మహర్షి మేకర్స్‌ సాహసం చేసి మరీ ఈ చిత్రంకు సీన్స్‌ పెంచుతున్నారు..