బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియకపోవచ్చు.
ఇక రవీనాటాండన్ కెరీర్ లో వచ్చిన టిప్ టిప్ బర్సా పాని అనే పాట ఆల్ టైమ్ సక్సెస్ ఫుల్ సాంగ్ గా నిలిచింది.ఇక రవీనాటాండన్ ఆ పాటలో తన అందాలను ఆరబోస్తూ స్టెప్పులను ఇరగదీసింది.
ఆ పాటలో తన అందాలతో యువతను తల్లడిల్లేలా చేసింది.ఇప్పటికీ చాలామందికి మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఆ పాట నిలిచిపోయింది.
ఇక ఆ పాటలో రవీనా టాండన్ తో అక్షయ్ కుమార్ రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇదే పాటను సూర్య వంశీ సినిమాలో రీమిక్స్ చేశారు.
ఇక అప్పుడు ఇప్పుడు రెండు సార్లు కూడా అక్షయ్ కుమార్ ఆ పాటలోని హాట్ బ్యూటీస్ తో రొమాన్స్ చేశాడు.అప్పట్లో రవీనాటాండన్ తో రొమాన్స్ చేయగా ఇప్పుడు కత్రినా కైఫ్ తో రొమాన్స్ చేశాడు అక్షయ్ కుమార్.
ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్స్ కు మళ్లీ అదే లెవెల్ లో మ్యూజిక్ ను రిపీట్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.కానీ ఈ పాట విషయంలో రెండో సారి కూడా అదుర్స్ అనిపించింది.
ఇక ఈ పాటలో కత్రీనా మామూలుగా ఆడి పాడలేదు.ఇక ఆమె అందానికి ఫరా ఖాన్ బయోగ్రఫీ తోడవ్వడంతో మరింత సొగసు తీసుకొచ్చింది.

ఇక టిప్ టిప్ బర్సా లేటెస్ట్ వెర్షన్ కి ఫరాఖాన్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తోంది అని తెలిసిన తర్వాత రవీనా టాండన్ పలుసార్లు ఫోన్ చేసిందట.తన కేరీర్ లో బెస్ట్ సాంగ్ అని కాబట్టి ఆ సాంగును ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయవద్దని హెచ్చరించిందట.ఇదే విషయాన్ని ఫరాఖానే స్వయంగా చెప్పుకొచ్చింది.ఇక సూర్యవంశం సినిమా కోసం రీ క్రియేట్ చేస్తున్న టిప్ టిప్ బర్సా సాంగ్ పబ్లిక్ లోకి విడుదల కాగానే మొదటి రవీనా టాండన్ ఫోన్ చేసి మరీ మెచ్చుకుందట.
ఇక ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన ఫరా ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించింది.