ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ ఆ పరిస్థితి తీసుకురారు  

Ntr Fans Meera Chopra Tollywood News - Telugu Fans, Meera Chopra, Ntr, Social Media, Tollywood News

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై హీరోయిన్ మీరా చోప్రా చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.తనపట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మీరా చోప్రా సోషల్ మీడియా సాక్షిగా వాపోయింది.

 Ntr Fans Meera Chopra Tollywood News

తనకు ఎన్టీఆర్ ఎవరో తెలీదన్న ఒకే ఒక్క కారణంతో ఈ రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను మానసికంగా వేధిస్తున్నారని మీరా చోప్రా తెలిపింది.సోషల్ మీడియాలో తనపై దుర్భాషలాడుతూ వారు పైశాచిక ఆనందం పొందుతున్నారని మీరా ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు తనను ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని ఈ బ్యూటీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.అయితే ఎలాంటి వివాదాలకు తావివ్వని స్టార్ హీరోల్లో ఎప్పుడూ ముందుండే తారక్, తన ఫ్యాన్స్ కారణంగా ఓ హీరోయిన్‌తో మాటలు పడాల్సి వస్తుందని నందమూరి ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ ఆ పరిస్థితి తీసుకురారు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో అసలు కథ ఏమిటో వారు తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.అసలు మీరా చోప్రాపై సోషల్ మీడియాలో దాడికి దిగింది ఎవరో తేల్చే పనిలో వారు పడ్డారు.

నందమూరి ఫ్యాన్స్‌గా తమ హీరోలకు ఎప్పుడూ మాట కూడా రానివ్వని అభిమానులు, ఇప్పుడు తమ అభిమాన హీరో పరువును ఎలా తీస్తామని వారు అంటున్నారు.

నిజానికి ఈ మొత్తం వివాదంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ మీరా చెప్పడమే కానీ, వారు ఎవరనే విషయంపై ఎవరూ ఫోకస్ పెట్టలేదు.

దీంతో తమ అభిమాన హీరో ఇలా ఓ హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితిని ఎప్పటికీ తీసుకు రామని వారు అంటున్నారు.అంతేగాక ఈ వివాదంలో మీరాపై బెదిరింపులకు పాల్పడిన వారు ఎలాంటి వారైనా వారిపై చర్యలు తీసుకునేలా తాము ముందుండి చూసుకుంటామని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr Fans Meera Chopra Tollywood News Related Telugu News,Photos/Pics,Images..

footer-test