అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి.లేదంటే అది ఉన్మాదం అవుతుంది.
సినిమా తారల ప్యాన్స్ అయినా.క్రికెటర్ల ఫ్యాన్స్ అయినా.
ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది.కానీ ఒక్కోసారి పలు కారణాలను సాకుగా చూపుతూ క్రికెట్ ఫ్యాన్స్ నానా రచ్చ చేసిన సందర్బాలున్నాయి.
ఇంతకీ వాళ్లు.ఎప్పుడు.
ఎందుకు హద్దులు మీరారో ఇప్పుడు చూద్దాం.
ధోనీ కూతురుపై అసభ్య పదజాలంఒక మ్యాచ్ లో ధోనీ సరిగా ఆడలేకపోయాడు.
ఫలితంగా మ్యాచ్ ఓడిపోయింది.దీంతో క్రికెట్ అభిమానుల ఒళ్లు బలుపు బయటపడింది.
ధోనీ కూతురుని అసభ్యపదజాలంతో తిట్టారు.చిన్నపాప అని చూడకుండా రేప్ చేస్తామంటూ పశువుల్లా ప్రవర్తించారు.
2007 ప్రపంచ కప్ఈ వరల్డ్ కప్ లో భారత జట్టు ఎలిమినేట్ అయ్యాక క్రికెట్ అభిమానులు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరించారు.క్రికెటర్ల దిష్టిబొమ్మలు దగ్దం చేశారు.
వాళ్ల ఇండ్లపై దాడి చేసి ధ్వంసానికి పాల్పడ్డారు.
1996 వరల్డ్ కప్1996లో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా, శ్రీలంక మ్యాచ్ జరిగింది.ఇందులో భారత్ ఓడిపోయింది.దీంతో రెచ్చిపోయిన అభిమానులు స్టేడియంనే తగలబెట్టారు.
అనుశ్క శర్మపై బూతులువిరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అప్పుడప్పుడు మ్యాచ్ లు చూసేందుకు వచ్చేది.ఒక వేళ కోహ్లీ క్రికెట్ సరిగా ఆడకపోతే.అనుష్కపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు.
దిండా అకాడమీదశాబ్ద కాలం పాటు సూపర్ బౌలర్ గా కొనసాగాడు అశోక్ దిండా.
కానీ అతడి గురించి ఒక సందర్భంలో ఎలాంటి కారణం లేకుండా మాటల దాడికి దిగారు.దీనిపై ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశాడు.
సచిన్ టెండూల్కర్సచిన్ కెప్టెన్ గా ఉన్న సందర్భంలో 1997లో వెస్టిండీస్ తో టెస్టు మ్యాచ్ జరిగింది.4 ఇన్నింగ్స్ లో ఇండియా టార్గెట్ జస్ట్ 120 పరుగులు.కానీ.ఇండియా చేయలేకపోయింది.దీంతో కొద్ది రోజుల పాటు పేపర్లలో, టీవీల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.సురేష్ రైనా
ఐపీఎల్ ఓసారి దుబాయ్ లో జరిగింది.ఈ సందర్భంగా సురేష్ రైనా అక్కక షికారు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాడు.క్రికెట్ సరిగా ఆడకుంగా వేశాలు వేయడానికి వెళ్లావా అంటూ దుమ్మెత్తి పోశారు కొందరు సైకోలు.
అప్పుడు ఆయన చెన్నై టీం తరఫున ఆడుతున్నాడు.
రాహుల్ ద్రావిడ్ ఇంటిపై రాళ్లు2007 లో టీమిండియా కెప్టెన్ రాహుల్ ద్రావిడ్.
ఆ సమయంలో జరిగిన వరల్డ్ కప్ లో భారత్ ఓడిపోయింది.ఈ సందర్భంగా కొందరు ఆకతాయిలు ద్రావిడ్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు.