క్షమాపణ చెప్పమంటున్నది.. ఈ బాలకృష్ణనా లేక ఆ బాలకృష్ణనా నాగబాబు…  

Fans War About Nagababu And Balayya Babu Sorry Issue In Social Media - Telugu Balakrishna, Fans War, Nagababu, Social Media, Tollywood

మామూలుగా తమ అభిమాన నటులను ఎవరైనా ఏమైనా అంటే వారిని సోషల్ మీడియా తెగ ట్రోల్స్ చేస్తుంటారు.కాగా తాజాగా సినీ ఇండస్ట్రీలో జరిగినటువంటి మీటింగులకు తనని పిలవలేదని లెజెండ్ బాలకృష్ణ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 Fans War About Nagababu And Balayya Babu Sorry Issue In Social Media

దీంతో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ సినీ పరిశ్రమలో జరిగే మీటింగులకు ఎవరిని పిలవాలో ఎవరి పిలువకూడదో  తనకి బాగా తెలుసని, అలాగే నోరు అదుపులో పెట్టుకో వాలని, అంతేగాక క్షమాపణ కూడా చెప్పాలని కూడా పలు సంచలన వ్యాఖ్యలు నందమూరి బాలకృష్ణ పై చేశాడు.

దీంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో ఇటు నందమూరి అభిమానులు, మెగా అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

క్షమాపణ చెప్పమంటున్నది.. ఈ బాలకృష్ణనా లేక ఆ బాలకృష్ణనా నాగబాబు…-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక ఒకరిపై ఒకరు ట్రోల్స్, మీమ్స్ వంటివి చేసుకుంటూ పెద్ద యుద్ధమే జరుగుతుంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా మరికొందరు మాత్రం గతంలో నందమూరి బాలకృష్ణ పై నాగబాబు తనకు బాలకృష్ణ ఎవరో తెలియదని అంటూ పలు వ్యాఖ్యలు చేశాడు.

దీంతో ప్రస్తుతం నందమూరి అభిమానులు బాలకృష్ణ ఎవరో తెలియదని గతంలో అన్నావు కదా నాగబాబు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సింది ఆ బాలకృష్ణ లేక నందమూరి బాలకృష్ణ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ విషయం గురించి పలువురు సినీ ప్రముఖులు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.

ఇందులో భాగంగా సినీపరిశ్రమలో గొడవలు మంచిది కాదని అంతేగాక సినీ పరిశ్రమలో ఇటు మెగా ఫ్యామిలీ కి అటూ నందమూరి ఫ్యామిలీ కి మంచి సన్నిహిత సంబంధాలున్నాయని కాబట్టి ఇలాంటి విషయాలపై బహిరంగంగా కంటే అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fans War About Nagababu And Balayya Babu Sorry Issue In Social Media Related Telugu News,Photos/Pics,Images..

footer-test