ప్రభాస్ రావాలంటూ కోరుతున్న ఫ్యాన్స్  

Fans Want Prabhas On Twitter - Telugu Chiranjeevi, Fans, Prabhas, Telugu Movie News, Twitter

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.ఇటీవల జార్జియాలో షూటింగ్ జరుపుకుని వచ్చిన ప్రభాస్, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు.

 Fans Want Prabhas On Twitter

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ప్రభాస్ స్వీయ నిర్భంధంలో ఉన్నాడు.కాగా సోషల్ మీడియాలో కేవలం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఉన్న ప్రభాస్‌ను ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఓ బలమైన కోరిక కోరుతున్నారు.

మిగతా హీరోల మాదిరిగా ప్రభాస్ కూడా ట్విట్టర్‌లో అడుగు పెట్టాలని వారు కోరుతున్నారు.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్‌లో అడుగు పెట్టగా సోషల్ మీడియాలో ఆయన ట్రెండింగ్‌ అయ్యారు.

ప్రభాస్ రావాలంటూ కోరుతున్న ఫ్యాన్స్-Gossips-Telugu Tollywood Photo Image

ఇక రీసెంట్‌గా యంగ్ హీరో శర్వానంద్ కూడా ట్విట్టర్ గూటికి చేరుకున్నారు.దీంతో ఇప్పుడు ప్రభాస్ కూడా ట్విట్టర్‌లోకి వచ్చి తమతో చాట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

మొత్తానికి స్టార్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆయన్ను ట్విట్టర్‌లోకి రావాల్సిందిగా పెద్ద ఎత్తున కోరుతున్నారు.మరి ప్రభాస్ ట్విట్టర్‌లో ఎప్పుడు అడుగు పెడతాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు