బాలయ్య ఆహా షో లో వీరిద్దరు కావాలంటున్న అభిమానులు

Fans Want Chiru And Ntr In Balakrishna Unstoppable Aha Show

నందమూరి బాలకృష్ణ నుండి ఎవరు ఊహించని విధంగా టాక్ షో వస్తోంది.ఆహా లో రాబోతున్న అన్ స్టాపబుల్‌ టాక్ షో లో వచ్చే గెస్ట్‌ లు.

 Fans Want Chiru And Ntr In Balakrishna Unstoppable Aha Show-TeluguStop.com

వారితో బాలయ్య అడిగే ప్రశ్నలు రాబట్టే సమాధానాల గురించి అందరి దృష్టి ఉంది.ఇదే సమయంలో బాలయ్య షో లో ఎవరు వస్తారు అనే విషయమై చర్చ జరుగుతున్న సమయంలో ప్రేక్షకులు మరియు అభిమానులు ముఖ్యంగా ఇద్దరు కావాలని ఎక్కువగా కోరుకుంటున్నారు.

వారే మెగాస్టార్‌ చిరంజీవి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. వీరిద్దరితో బాలయ్య అన్ స్టాపబుల్‌ టాక్ షో చేస్తే చూడాలని ఆశ పడుతున్నామని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు.

 Fans Want Chiru And Ntr In Balakrishna Unstoppable Aha Show-బాలయ్య ఆహా షో లో వీరిద్దరు కావాలంటున్న అభిమానులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఇది ఖచ్చితంగా వర్కౌట్‌ అవుతుందా అంటే డౌటే అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ టాక్‌ షో లో పాల్గొంటున్న వారి జాబిత ఇప్పటిక సిద్దం అయ్యింది.

ఒక వేళ వారిద్దరు ఇందులో ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే ఆ పేర్లు వచ్చేవి.కాని వారు లేకపోవడం వల్లే టాక్ రాలేదు.

బాలకృష్ణ నుండి టాక్ షో రావడమే గొప్ప విషయం గా ప్రేక్షకులు మరియు అభిమానులు భావిస్తున్నారు.కనుక బాలయ్య నుండి వస్తున్న ఆ టాక్ షో లో వీరిద్దరిని గెస్ట్ లుగా ఆశించడం మరీ అతి అవుతుందని అంటున్నారు.

ఎన్టీఆర్‌ తో విభేదాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయం.ఇక బాలయ్య మరియు చిరంజీవిల మద్య ఉన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Telugu Aha Show, Balakrshna, Chiru, Tollywood, Unstoppable-Movie

ఇద్దరు కూడా బిగ్గెస్ట్‌ స్టార్స్ అవ్వడం వల్ల మొదటి నుండి పోటీ ఉంటుంది.ఇద్దరు కూడా పైకి మంచి స్నేహితులుగా కనిపిస్తారు కాని పోటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.ఒక వేళ బాలయ్య నుండి ఆహ్వానం అందితే ఖచ్చితంగా చిరు వెళ్తాడు.కాని బాలయ్య అందుకు ఆసక్తిగా ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఎన్టీఆర్‌ కు బాలయ్య ఆహ్వానం అందడం కష్టమే.ఎన్టీఆర్‌ ఒప్పుకోవడం కూడా కష్టమే అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరిలో ఒక్కరు అయినా షో కు వస్తే రికార్డు వ్యూస్‌ ఖాయం.షో రికార్డు సక్సెస్ ఖాయం.

#Balakrshna #Aha #Chiru #Unstoppable

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube