ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న... క్రేజీ మూవీస్ అప్డేట్స్ ఇవే?

కొన్ని సినిమాలు అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా ఇంకా వాటికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయిన అప్డేట్ ఇంకా రాలేదు.దీనితో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Crazy Upcoming Movies , Movies , Tollywood, Allu Arjun , Pushpa 2 , Prabhas, Anil Ravi Pudi , Rajanikanth , Ram Charan, Balakrishna, Maruthi , Trivikra , Ntr , Mahesh Babu , Pawan Kalyan , Harish Shanker-TeluguStop.com

అయితే ఇలాంటి వారికి ఎండాకాలంలో ఒక చల్లని వార్త అందించింది తెలుగు సినిమా పరిశ్రమ.కొందరి హీరోల సినిమాలు సమ్మర్ తర్వాత మొదలు అవుతాయని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

జూలై నెలలో చాలా పెద్ద సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేయనున్నాయి.

 Crazy Upcoming Movies , Movies , Tollywood, Allu Arjun , Pushpa 2 , Prabhas, Anil Ravi Pudi , Rajanikanth , Ram Charan, Balakrishna, Maruthi , Trivikra , Ntr , Mahesh Babu , Pawan Kalyan , Harish Shanker-ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న#8230; క్రేజీ మూవీస్ అప్డేట్స్ ఇవే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రెండు వారాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సర్కారు వారి పాట మొదటి షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ తో థియేటర్ లలో దూసుకుపోతోంది.ఇందులో మహేష్ బాబు కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్ లుగా నటించగా, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన పరుశురాం దీనికి డైరెక్టర్ గా చేశారు.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రానున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను జూలై నెల నుండే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

కేవలం సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాను పూర్తి చేస్తారని తెలుస్తోంది.ఈ సినిమా టైటిల్ ను ఇంకో పది రోజుల్లో అనౌన్స్ చేస్తారు.

ఇక ఆర్ ఆర్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ గా హిట్ సాధించిన చిత్రం తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే.ఇందుకు సబందించిన మోషన్ పోస్టర్ ను మొన్ననే రిలీజ్ చేశారు.ఇది ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.ఇందులో ఎన్టీఆర్ సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు.ఇందుకోసం ఎన్టీఆర్ 9 కిలోలు తగ్గుతున్నాడు.ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా రానుంది.ఇక ఈ సినిమా స్టోరీ కూడా ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సినిమా కూడా జూలై లో స్టార్ట్ అవుతుందట.అన్ని అనుకున్నట్లు జరిగితే 2023 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్.

టాలీవుడ్ రెబల్ స్టార్ట్ ప్రభాస్ బాహుబలి లాంటి హిట్ సినిమా తర్వాత ఏదీ హిట్ కాలేదు.వరుసగా సాహో మరియు రాధే శ్యామ్ సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి.

దీనితో వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడా.కాగా మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ప్రభాస్ ఓకె అన్నట్లు తెలిసిందే.

ఈ వాస్తవంగా ఈ సినిమా గత నెల లోనే షూటింగ్ స్టార్ట్ కావలసి ఉండగా… కొన్ని కారణాల వలన ఆగిపోయింది.దీనితో జూలై లో షూటింగ్ మొదలు కానుంది.

ఇది కేవలం 50 రోజుల్లో కంప్లీట్ అవుతుందట.దీనికి తగిన విధంగా మారుతి స్క్రిప్ట్ ను రెఢీ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కరోనా తర్వాత పుష్ప సినిమాతో మన ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు.ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

దీనితో ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి జూలై నెల వరకు ఆగాల్సిందే అంటున్నారు సినిమా పరిశ్రమ వర్గాలు.

ఈ సినిమాను 400 కోట్ల బడ్జెట్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.ఇది పాన్ ఇండియా సినిమా అని తెలిసిన విషయమే.

ఇక ఈ సినిమాను కేవలం 6 నెలల కాలంలోనే పూర్తి చెయ్యాలని ప్లాన్ లో ఉన్నారట చిత్ర బృందం.అలా చూసుకుంటే 2023 సమ్మర్ కి ఈ సినిమాను విడుదల చేస్తారట.

మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడు.ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్… అయితే ఈ సినిమా ఆరు నెలలకు ముందే స్టార్ట్ అవ్వాల్సింది.కానీ పవన్ కు మిగిలిన సినిమాలు ఉండడంతో అది లేట్ అవుతూ వచ్చింది.

దీనితో ఈ సినిమాను జూలైలో సెట్స్ పైకి తీసుకెళ్తారట.అయితే ఈ సినిమాను ఎటువంటి పరిస్థితుల్లో మరో ఆరు నెలలు కాలంలో కంప్లీట్ చేసి విడుదల చేస్తారని ఇండస్ట్రీ టాక్.

కానీ ఏమి జరగనుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక పవన్ కళ్యాణ్ నటించనున్న మరి సినిమా వినోదయ సిత్తం… ఇది తమిళ్ లో విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో ప్రముఖ దర్శకుడు సముద్రఖని దీనిని తెరకెక్కించడానికి పవన్ ను ఒప్పించాడు.

ఇందులో పవన్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కోడా జూలై నెలలో సెట్స్ పైకి వెళుతుంది అని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం డైరెక్టర్ చాలా ఎక్స్సైటింగ్ గా ఉన్నాడు.

Telugu Allu Arjun, Anil Ravi Pudi, Balakrishna, Crazy, Harish Shanker, Mahesh Babu, Maruthi, Pawan Kalyan, Prabhas, Pushpa, Rajanikanth, Ram Charan, Tollywood, Trivikra-Latest News - Telugu

ఇక జెర్సీ సినిమాతో టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు గౌతం తిన్ననూరి.ఇందులో నాని హీరోగా నటించాడు.అలా రామ్ చరణ్ ను తన దగ్గర ఉన్న సెంటిమెంటల్ మాస్ కథతో ఒప్పించాడు.

అది అలా పెండింగ్ పడింది.కాగా ఇదే సినిమాను బాలీవుడ్ లో సాహిద్ కపూర్ రీమేక్ చేశాడు.

కానీ అక్కడ ఇది ప్లాప్ గా నిలిచింది.అయితే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళుతుంది.నందమూరి బాలయ్య అఖండ లాంటి సాలిడ్ హిట్ తర్వాత ఏ సినిమాతో వస్తాడు అని ఫ్యాన్స్ చాలా వెయిటింగ్.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి త్వరలో బాలకృష్ణ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళతాడట.బాలయ్య గోపీచంద్ తో సినిమా తీసింది తీస్తుండడంతో ఇది లేట్ అయ్యేలా ఉంది.

అలా చూస్తే… సెప్టెంబర్ నుండి అనిల్ రావిపూడి బాలయ్య ల మూవీ మొదలు అవుతుంది.

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇంత వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తీస్తూ ఫ్యాన్ కి మజాను ఇస్తున్నాడు.

ప్రస్తుతం రజినీ కెరీర్ లో 168 వ సినిమాను తీయడానికి సిద్దంగా ఉన్నాడు.ఈ సినిమాను బీస్ట్ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ సినిమా ఆగస్ట్ లో షూటింగ్ స్టార్ట్ చేయనుంది అని తమిళ సినిమా వర్గాలు చెబుతున్నాయి.ఇలా స్టార్ హీరోలు తమ కొత్త సినిమాలను రానున్న జూలై నుండి సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేసే వచ్చే జనవరి నుండి సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube