''గేమ్ చేంజర్'' ఫస్ట్ లుక్ యూనిక్ గా లేదా.. ఈ ఇద్దరి రేంజ్ ను మ్యాచ్ చేయలేదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ట్రిపుల్ ఆర్ ( RRR) సినిమాతో సంచలన విజయం అందుకుని ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇక ఇటీవల ఈ సినిమాకు ఆస్కార్ రావడంతో ఈయన క్రేజ్ గ్లోబల్ వైడ్ గా మరింత పెరిగింది.

 Fans Upset With The Ram Charan Game Changer First Look, Director Shankar, Ram Ch-TeluguStop.com

మొన్నటి వరకు ఆస్కార్ సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ గత రెండు రోజుల నుండి తన పుట్టిన రోజు వేడుకల్లో బిజీగా ఉన్నారు.నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయన నటించే కొత్త సినిమా నుండి అప్డేట్ ల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూసారు.మరి మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నట్టుగానే నిన్న ఈయన నటిస్తున్న కొత్త సినిమా నుండి అప్డేట్ అయితే వచ్చింది.

చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC15‘.ఈ సినిమా నుండి చరణ్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనౌన్స్ చేసారు.

అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాకు ”గేమ్ ఛేంజర్” ( Game Changer ) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది.అయితే శంకర్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో అందరికి తెలుసు.ఈయన ఏ చిన్న అప్డేట్ అయినా చాలా కొత్తగా యూనిక్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు.

కానీ ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ బాగానే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ఒక విషయంలో నిరాశగా ఉన్నారు.టైటిల్ బాగానే ఆకట్టుకున్న ఫస్ట్ లుక్ మాత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది.గ్లోవర్ వైడ్ గా రామ్ చరణ్ కు మాత్రమే కాదు శంకర్ కు కూడా మంచి పేరు ఉంది.మరి వీరిద్దరి రేంజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా పోస్టర్ లేదంటున్నారు.

ఈ పోస్టర్ కాస్త డిఫరెంట్ గా ఉన్న సింపుల్ గానే ఉందని టాక్ వచ్చింది.దీంతో ముందు ముందు అయిన ఈయన మార్క్ కు తగ్గట్టుగా ఈ సినిమా అప్డేట్ లు ఉంటాయో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube