మహేష్‌పై ఒత్తిడి తెస్తున్న అభిమానులు  

Fans Troubling Mahesh Babu - Telugu Mahesh Babu, Parasuram, Sarkaari Vari Paata, Tollywood News

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని ప్రకటించిన మహేష్, ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించాలని చూస్తున్నాడు.

 Fans Troubling Mahesh Babu

అయితే ఈ సినిమాను మే 31న ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

కాగా ఈ సినిమా ప్రారంభం గురించి మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, వారు ఈ ప్రారంభోత్సవాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.#SSMB27UpdateOnMay31 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మే 31న చెప్పనున్నట్లు అభిమానులు ట్రెండింగ్ చేస్తున్నారు.అయితే గతంలోనే మే 31న ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభం ఉండకపోవచ్చని మహేష్ సన్నిహితులు చెప్పుకొచ్చారు.

మహేష్‌పై ఒత్తిడి తెస్తున్న అభిమానులు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతేడాది సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల మరణించడం, ఇంకా ప్రధమ వర్ధంతి జరగకపోవడంతో ఈ సినిమా ప్రారంభోత్సవం ఉండకపోవచ్చని సంకేతాలు అందాయి.

దీంతో ఇప్పుడు ఇలా తన సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించి ఫ్యాన్స్ ఇలా రచ్చ చేస్తుండటంతో మహేష్ తలపట్టుకుంటున్నాడు.

గతంలో ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ లేకపోవడంతో వారు చిత్ర నిర్మాతలను తెగ ట్రోల్ చేశారు.ఇప్పుడు మహేష్ సినిమాను కూడా ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తుండటంతో మహేష్ అండ్ టీమ్ ఆందోళన చెందుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fans Troubling Mahesh Babu Related Telugu News,Photos/Pics,Images..

footer-test