ఎన్టీఆర్ మ్యారేజ్ డే ను స్పెషల్ గా మార్చేసిన ఫ్యాన్స్ !

స్టార్స్ లైఫ్ లో ముఖ్యమైన రోజులను స్పెషల్ గా చేయడంలో టాలీవుడ్ అభిమానులు ముందు వరుసలో ఉంటారు.తమ అభిమాన హీరోలకు వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుంది పోయేలా చేస్తారు.

 Fans Take Over Social Media To Wish Ntr Lakshmi Pranathi On Their Wedding Anniversary-TeluguStop.com

అలాగే ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దంపతుల మ్యారేజ్ డే.ఈ సందర్భంగా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ దంపతులకు స్పెషల్ గా విషెష్ తెలుపుతూ ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉన్నారు.

ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకుని సరిగ్గా పది సంవత్సరాలు అవుతుంది.ఎన్టీఆర్ ప్రణతి వివాహం 2011 మే 5 న అంగరంగ వైభవంగా జరిగింది.వీరి దాపంత్యనికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.వీరికి 2014 లో అభయ్ రామ్, 2018 లో భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 Fans Take Over Social Media To Wish Ntr Lakshmi Pranathi On Their Wedding Anniversary-ఎన్టీఆర్ మ్యారేజ్ డే ను స్పెషల్ గా మార్చేసిన ఫ్యాన్స్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్టీఆర్ దంపతుల మ్యారేజ్ డే సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దంపతుల స్పెషల్ రోజును మరింత స్పెషల్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎన్టీఆర్ ఈ సినిమాలతో పాటు కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

#FansTake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు