రష్మిక క్యూట్ లుక్స్! ఫ్యాన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్  

ఆకట్టుకుంటున్న రష్మిక చిన్ననాటి ఫోటోలు. .

Fans Surprise Gift To Rashmika Mandana-

ప్రస్తుతం టాలీవుడ్ జెట్ స్పీడ్ తో తనదైన ముద్ర వేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి రష్మిక మందన.చలో తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

Fans Surprise Gift To Rashmika Mandana--Fans Surprise Gift To Rashmika Mandana-

ప్రస్తుతం భామ విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తూ ఉండగా, నితిన్ తో భీష్మ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హరోగా తెరపైకి వెళ్ళే సినిమాలో కూడా బన్నీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది.

ఇక తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ తనకి అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.ఇన్ స్టాగ్రమ్ లో రష్మిక క్యూట్ ఫోటో ఒకటి ఫ్యాన్స్ అదే పనిగా షేర్ చేశారు.

ఆ ఫోటోలో క్యూట్ స్కూల్ గాళ్ గా రష్మిక తెగ ముద్దొచ్చేసింది.చిరు ప్రాయంలో రకరకాల ఎక్స్ ప్రెషన్స్ కి సంబంధించిన ఫోటోల్ని ఎలా దొరకబుచ్చుకున్నారో కానీ ఆ ఫోటోల్ని తమ ఆరాధ్య దేవతకు షేర్ చేసి పెద్ద షాక్ నిచ్చారు.ఆ ఫోటోలు చూశాక రష్మిక ఉబ్బితబ్బిబ్బయ్యింది.