'దొరసాని' అంతా బాగానే ఉంది, అదొక్కటే మైనస్‌ అంటున్న సామాన్య ప్రేక్షకుడు  

Fans Review On Shivatmika Dorasani Movie-

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయం అయిన ‘దొరసాని’ చిత్రం మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ చిత్రంతో జీవిత రాజశేఖర్‌ల చిన్న కూతురు శివాత్మిక కూడా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.వీరిద్దరు కూడా సినిమా విడుదలకు ముందే అందరి హృదయాలను దోచుకున్నారు.సినిమాకు భారీగా పబ్లిసిటీ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి...

Fans Review On Shivatmika Dorasani Movie--Fans Review On Shivatmika Dorasani Movie-

సినిమా నేపథ్యం మూసగానే ఉన్నా సినిమా బాగుంటుందని అంతా భావించారు.

Fans Review On Shivatmika Dorasani Movie--Fans Review On Shivatmika Dorasani Movie-

అనుకున్నట్లుగానే సినిమా నేపథ్యంలో చాలా సినిమాల్లో చూసినట్లుగా మూసగానే ఉంది.అయితే కొన్ని సీన్స్‌ మాత్రం బాగున్నాయి.మొత్తంగా సినిమా ఒక యావరేజ్‌ మూడ్‌లో సాగింది.

మొత్తంగా చూస్తే సినిమా ఆకట్టుకుందని రివ్యూవర్స్‌ చెబుతున్నారు.అయితే సామాన్య ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా నెగటివ్‌ క్లైమాక్స్‌ను కలిగి ఉన్న కారణంగా కాస్త నిరాశ పర్చిందని అంటున్నారు.ఇలాంటి పరువు హత్యలకు సంబంధించిన సినిమాలు చాలా చూశాం..

అన్ని సినిమాల్లో కూడా అదే తరహా మరణాలు ఉంటే సినిమాను ప్రేక్షకులు ఏం ఆధరిస్తారు.

తెలుగు ప్రేక్షకులు యాంటీ క్లైమాక్స్‌ను ఒప్పుకోరు అని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు మీరు చేశారు అంటూ కొందరు ప్రేక్షకులు చిత్ర యూనిట్‌ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.క్లైమాక్స్‌ ఎంత బాగుంటే అంత మంచి టాక్‌ తెలుగు సినిమాలకు వచ్చిన సందర్బాలు ఉన్నాయి.అందుకే తెలుగులో మంచిగా ఉన్న సినిమాలు కూడా యాంటీ క్లైమాక్స్‌ కారణంగా ఫలితం రివర్స్‌ అయిన సందర్బాలు ఉన్నాయి.

ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరుగుతుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.