అన్న మా కోసం ఒక్కసారి చూపించు అంటూ చైతన్యను రిక్వెస్ట్ చేసిన అభిమానులు!

అక్కినేని యువ హీరో నాగచైతన్య సమంతతో విడాకులు ప్రకటన తర్వాత పూర్తిగా తన దృష్టిని తన కెరియర్ పై పెట్టినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే వరుస సినిమాలతో నాగచైతన్య ఎంతో బిజీగా ఉన్నా.

 Fans Requested Akkineni Nagachaitanya To Show His Body Details, Naga Chaitanya,-TeluguStop.com

ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.ఈ క్రమంలోనే నాగచైతన్య తన తర్వాత సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇతను విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యూ చిత్రంలో నటిస్తున్నారు.అదేవిధంగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ చిత్రంలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించడంతో ఈ పాత్ర కోసం నాగ చైతన్య ఎంతో కష్టపడి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే చైతు జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ బాడీ బిల్డ్ చేసుకుంటున్నాడు.ఇలా నాగ చైతన్య సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వర్కౌట్స్ మాత్రం మిస్ కానని షూటింగ్ లొకేషన్ లో కూడా తన కోసం జిమ్ ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సందర్భంగా నాగచైతన్య ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటో షేర్ చేసారు.

Telugu Bangarraju, Fans, Naga Chaitanya, Thankyou, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ ఏంటన్నా ఇది ఇలాంటి బాడిని పెట్టుకొని ఒక్కసారి కూడా నీ బాడీని చూపించకపోవడం ఏంటి.కనీసం నీ నెక్స్ట్ సినిమాలో అయినా నీ సిక్స్ ప్యాక్ బాడీని చూపించు అన్నా అంటూ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అక్కినేని అభిమానులను ఆకట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube