హరీష్‌ శంకర్‌కు పవన్‌ ఫ్యాన్స్‌ ఒక విజ్ఞప్తి  

Pawan Kalyan Fans Request To Harish Shankar-pawan Kalyan,pawan Kalyan And Harish Shankar,pawan Kalyan And Krish,pawan Kalyan Latest Update,tollywood Power Star Pawan Kalyan

పవన్‌ కళ్యాణ్‌ 26వ చిత్రంగా పింక్‌ను రీమేక్‌ చేస్తున్నాడు, 27వ చిత్రంగా క్రిష్‌ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాణంలో చేయబోతున్నాడు.ఇక 28వ చిత్రంగా మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.

Pawan Kalyan Fans Request To Harish Shankar-Pawan Pawan And Shankar Krish Latest Update Tollywood Power Star

ఈ మూడు సినిమాలు కూడా సమాంతరంగా షూటింగ్‌ జరుపుకోబోతున్నాయి.మూడు కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు.

అయితే ఈ మూడు సినిమాల్లోకి హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై పవన్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఉన్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హరీష్‌ శంకర్‌ ఒక మాంచి కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ను పవన్‌ కళ్యాణ్‌తో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట.అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభం అయ్యింది.మైత్రి వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారట.

ఇదే సమయంలో పవన్‌ ఫ్యాన్స్‌ హరీష్‌ శంకర్‌కు సోషల్‌ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు.

గతంలో పవన్‌కు గబ్బర్‌ సింగ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాను ఇచ్చావు.నీవు ఒక అభిమానిగా ఆయన అభిమానులు ఏం కావాలో కోరుకుంటున్నారో తెలుసుకుని అదే గబ్బర్‌ సింగ్‌లో చూపించావు.ఇప్పుడు పవన్‌ను ఎలా చూడాలనుకుంటున్నామో, పవన్‌ నుండి ఏమి ఆశిస్తున్నామో మా వైపు నుండి నువ్వు ఒక అభిమానిగా ఆలోచించి సినిమా తెరకెక్కించు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

మరి పవన్‌ తో హరీష్‌ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు

Pawan Kalyan Fans Request To Harish Shankar-pawan Kalyan,pawan Kalyan And Harish Shankar,pawan Kalyan And Krish,pawan Kalyan Latest Update,tollywood Power Star Pawan Kalyan Related....