కింగ్ కోహ్లీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి ప్రపంచ క్రికెట్లో ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు అతను సాధించిన రికార్డులు అతను ఎంత గొప్ప ఆటగాడు అని చెప్పకనే చెబుతుంటాయి అని చెప్పాలి.కానీ ఈ ఏడాది మాత్రం ఎందుకో విరాట్ కోహ్లీ సరిగ్గా రాణించలేకపోయాడు.

 Fans Pay Tribute To The Work Done By King Kohli , Virat Kohili, Netizens, Fidda,-TeluguStop.com

స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇక అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు.అతడితో పాటు మిగిలిన ప్లేయర్స్ కూడా విఫలం కావడంతో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌–2లో రాజస్తాన్‌ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది.

అయితే రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ పెద్దగా ఆడకపోయినప్పటికీ.అతడి క్రీడాస్ఫూర్తి అందరి చేత శభాష్ అనిపించుకునేలా చేస్తోంది.

బౌల్ట్ వేసిన తొలి ఓవర్ లో డీప్ మిడ్ వికెట్ దిశగా కోహ్లీ ఫ్లిక్ షాట్ ఆడాడు.అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జాస్ బట్లర్ డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు.

నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు త్రో చేశాడు.అయితే అప్పటికే కోహ్లీ క్రీజులోకి చేరగా.

బంతి అతడిని తాకుతూ ఫీల్డర్ లేని వైపుకు వెళ్లింది.అయితే కోహ్లీ మాత్రం మరోసారి పరుగు తీసేందుకు ప్రయత్నం చేయలేదు.

రూల్స్ ప్రకారం ఫీల్డర్ విసిరిన బంతి బ్యాటర్ బ్యాట్ లేదా బాడీకి తగిలి వెళ్లినట్లయితే మరోసారి పరుగు తీయరాదు.ఇక్కడ కూడా అదే జరగ్గా.

స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న డు ప్లెసిస్ అదనపు పరుగు కోసం ప్రయత్నించాడు.అయితే కోహ్లీ మాత్రం బంతి తనకు తగిలినట్లు.

పరుగు వద్దంటూ వారించాడు.ఇప్పుడు ఇదే కోహ్లీని పొగిడేలా చేస్తోంది.

బౌల్ట్ బౌలింగ్ లో సిక్సర్ బాదిన కోహ్లీ.టచ్ లో ఉన్నట్లు కనిపించాడు.అయితే ఆ తర్వాతి ఓవర్లోనే ప్రసిధ్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని వెంటాడి మరీ పెవలియన్ కు చేరాడు.అదృష్టం కొద్ది ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న బెంగళూరు.

శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైంది.ఓపెనింగ్‌ బ్యాటర్‌ బట్లర్‌ (60 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) తాజా సీజన్‌లో నాలుగో సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్‌ రెండో సారి ఫైనల్‌కు చేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube