గురూజీ నువ్వు గ్రేట్‌.. ఇన్నాళ్లు వీటిని ఎక్కడ పెట్టావయ్యా?     2018-10-12   10:28:18  IST  Ramesh P

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇన్నాళ్లుగా తెరకెక్కించిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఆయన తాజాగా ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన చిత్రం ఒక ఎత్తు అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రికార్డు స్థాయిలో ఈ చిత్రం అన్ని ఏరియాల్లో 93 కోట్లకు అమ్ముడు పోయిన విషయం తెల్సిందే. ఇంత మొత్తం ఎన్టీఆర్‌ రాబట్టగలడా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. కాని త్రివిక్రమ్‌ అద్బుతమైన ఫ్యాక్షన్‌ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి పెట్టిన ప్రతి పైసా తిరిగి వచ్చేలా చేశాడు.

Fans Happy With Aravinda Sametha Movie Trivikram Mark Dialogues-

త్రివిక్రమ్‌ ఈ చిత్రంలో చూపించిన కొన్ని మాస్‌ సీన్స్‌కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇన్నాళ్లు ఈ మాస్‌ సీన్స్‌ను ఎక్కడ ఉంచావు గురూజీ అంటూ సోషల్‌ మీడియాలో త్రివిక్రమ్‌ ను ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఎన్టీఆర్‌ వంటి సరైన హీరో నీకు తగిలాడు, ఫుల్‌గా వాడేశావు గురూజీ నువ్వు గ్రేట్‌ అంటూ మరికొందరు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రంకు ఫ్యాన్స్‌ ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో త్రివిక్రమ్‌ ఈ చిత్రంను తెరకెక్కించాడు.

Fans Happy With Aravinda Sametha Movie Trivikram Mark Dialogues-

త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌ ఈ చిత్రంలో లేవని కొందరు అంటున్నా కూడా, ఫ్యాక్షన్‌ సినిమాలో పంచ్‌ డైలాగ్స్‌ ఏం బాగుంటాయి చెప్పడం, ఏం కావాలో అదే ఈ చిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్‌ చూపించాడు అంటూ ఫ్యాన్స్‌ చెబుతున్నారు. అన్ని విధాలుగా ఫ్యాన్స్‌ను మెప్పించిన త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌లు అరవింద సమేత చిత్రంతో టాప్‌ టెన్‌లో జాయిన్‌ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

త్రివిక్రమ్‌ గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌ అవ్వడంతో ఎన్టీఆర్‌ అభిమానులు అరవింద సమేత చిత్రంపై మొదట అంచనాలు పెట్టుకోలేదు. కాని ఎప్పుడైతే ఫస్ట్‌లుక్‌ వచ్చిందో, ఎప్పుడైతే టీజర్‌ వచ్చిందో అప్పటి నుండి అంచనాలు పీక్స్‌లో పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉందని నిన్న విడుదల తర్వాత అంటున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.