రామ్ చరణ్ కి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన అభిమానులు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ చిరుత సినిమాలో నటించారు.

 Fans Gave A Wonderful Gift To Ram Charan Ram Charan, Tollywood, Fans Gave Gift,-TeluguStop.com

ఈ సినిమా సెప్టెంబర్ 28 2007 వ తేదీ విడుదల అయింది.ఈ క్రమంలోనే రామ్ చరణ్ 14 సంవత్సరాల తన సినీ కెరీర్ పూర్తిచేసుకున్న సందర్భంగా అతనికి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసిన రామ్ చరణ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.14 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు తనకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు.ఈ క్రమంలోనే నెక్లెస్ రోడ్డు ఏరియాలో వివిధ రంగులతో అభిమానులు రామ్ చరణ్ ఆర్ట్ గీసారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే చరణ్ అభిమానులు #14YrsOfRAMCHARANEra అనే ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న RRR చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్ర నిర్మాణం పూర్తయిన సందర్భంగా RC15 అనే వర్కింగ్ టైటిల్ తో కోలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube