శిరీష్ ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాడు...అభిమానుల ఈ 8 కౌంటర్ లు చూస్తే నవ్వాపుకోలేరు!  

Fans Funny Counter To Allu Sirish Twitter-

సోషల్ మీడియా ఇలా కూడా ఉపయోగపడుతుందా అని ఇప్పటి వరకు తెలియదు .ట్విట్టర్ ని ఇలా కూడా వాడుతారా జనాలు అని మాకు ఇప్పటివరకు తెలీదు , మీకు లాప్టాప్ , iPhone X, One+ 6T, అండ్ ఇంకా డబల్ బెడ్ రూమ్ లాంటివి కావాలా ఐతాయ్ ఏం లేదు జస్ట్ అల్లు శిరీష్ కి ఒక ట్వీట్ పెట్టండి మీరు అడిగింది ఇచ్చేస్తాడు , ఆలా అని అతి ఆశ కి పోకండి ప్లీజ్.

అసలు ఇది చదివేసరికి ఏం అర్ధం అవ్వలేదు కదా.? అసలు కథ ఏంటి అంటే…విండోస్‌ యూజర్‌గా 20 ఏళ్ల పాటు కొనసాగిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో అల్లు శిరీష్‌, మ్యాక్‌ యూజర్‌గా మారిపోయారు.తన అన్న అల్లు అర్జున్‌ ఇచ్చిన గిఫ్ట్‌తో అల్లు శిరీష్‌కు కొత్త ల్యాప్‌టాప్‌ వచ్చేసింది.ఈ సందర్భంగా తన అన్నకు కృతజ్ఞత చెబుతూ.అల్లు శిరీష్‌ ట్వీట్‌ చేశారు.

Fans Funny Counter To Allu Sirish Twitter-

https://twitter.com/AlluSirish/status/1045180976949686272

ఈ ట్వీట్ కు ఓ నెటిజెన్ రిప్లై ఇచ్చారు…
“అన్నా నాకు కూడా ఒక చిన్న ల్యాప్‌టాప్‌ గిఫ్ట్‌ ఇవ్వు అన్నా.నేను కొనాలి అంటే ఇంకో మూడేళ్లు పడుతుంది.నాకు ఫ్యామిలీ ఉంది.శాలరీ తక్కువ.నా ఉద్యోగంలో ల్యాప్‌టాప్‌ వాడకం ఎక్కువ కానీ నాకు ల్యాప్‌టాప్‌ లేదు.కానీ నేను మీకు చాలా పెద్ద అభిమానిని శ్రీ’ అంటూ అల్లు అర్జున్‌కు, అ‍ల్లు శిరీష్‌కు ఆ ట్వీట్‌ను ట్యాగ్‌ చేశాడు.”

ఫ్యాన్ బాధను అర్థం చేసుకున్న వెంటనే అల్లు శిరీష్‌, ‘అయ్యో.బాధపడకు బ్రదర్‌, నీవు సంపాదిస్తున్నావు.మీ కుటుంబాన్ని పోషిస్తున్నాయి.నా దగ్గర కొత్త ల్యాప్‌టాప్‌ ఉంది.నా సోని వైవో ల్యాప్‌టాప్‌ను నీవు తీసుకో.కూల్‌.నాకు డైరెక్ట్‌ మెసేజ్‌ పంపు.చీర్స్‌’ అంటూ ఈ యంగ్‌ హీరో ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి.అల్లు శిరీష్‌కు ఎంతో పెద్ద మనసో అంటూ.అభినందనలు వెల్లువ కొనసాగుతోంది.సూపర్‌ అన్నయ్య మీలాంటి వాళ్లు రిప్లయ్‌ ఇవ్వడమే గొప్ప గిఫ్ట్‌ అని, దయా హృదయం అంటూ.పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అల్లు శిరీష్‌ అభిమానులు.‘అన్నా.నాకు ఎప్పుడు ఇస్తావు గిఫ్ట్‌’ అంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారు.

కొంతమంది కొంటె అభిమానులు మాత్రం ఎలా ఆటపట్టిస్తున్నారో చూడండి

1.బ్రదర్‌ నాకు ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ కావాలి.కొనాలంటే ఐదేళ్లు పట్టేలా ఉంది అంటూ మరో యూజర్‌ కొంటెగా రిప్లయి ఇచ్చాడు.

2.అన్నా అలాగే ఇంకొంచెం పెద్ద మనసు చేసుకుని ఏపీ 9 బీడ్ల్యూ 666 ని నాకు ఇచ్చేయ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు.త్వరలో అ‍ల్లు అర్జున్‌ మీకు కొత్త కారు గిఫ్ట్‌గా ఇస్తారంటూ కూడా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

3.ఒకరైతే ఏకంగా గర్ల్ ఫ్రెండ్ కావాలని అడిగారు

4.ఒకరు ఎక్స్చేంజి ఆఫర్ కూడా పెట్టారు

5.ఇతనికి డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కావాలి అంట

6.లైన్ వేసుకోడానికి ఆటో కావాలంట

7.ఆడి కావాలంట

ఫైనల్ గా ఇవన్నీ చూసిన మన శిరీష్ అన్న రియాక్షన్ మీరే చూడండి!

.

తాజా వార్తలు

Fans Funny Counter To Allu Sirish Twitter- Related....