విరాట్ కోహ్లీపై ఫాన్స్ ఫైర్..! అభిమానిని దేశం వదిలి వెళ్ళమనడం కరెక్ట్ అంటారా.?

టీం ఇండియా కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో విరాట్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదమైంది.

 Fans Fire On Virat Kohli2-TeluguStop.com

ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్ నుంచి విరామం తీసుకుంటున్న విరాట్ ఇటీవల ఫ్యాన్స్‌తో సోషల్‌మీడియా ద్వారా ముచ్చటించాడు.

ఓ క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీని ‘‘ఓవర్‌రేటెడ్ ప్లేయర్” అని పేర్కొన్నాడు.

‘‘విరాట్ కోహ్లీ ఓ ఓవర్‌రేటెడ్ బ్యాట్స్‌మెన్.అతనిలో నాకు ఏదీ ప్రత్యేకంగా కనిపించదు.

ఇండియా వాళ్ల కంటే ఇంగ్లీష్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల బ్యాటింగ్ నాకు ఎంతో నచ్చుతుంది” అని పేర్కొన్నాడు.


ఈ వ్యాఖ్యలు విరాట్‌‌కు చాలా కోపం తెప్పించాయి.

దీంతో ఆ అభిమానికి ఘాటుగా సమాధానమిచ్చాడు.‘అయితే నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు.

దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపో.ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి.

ఈ దేశంలో ఉంటూ పరాయి దేశాలపై నీకు ప్రేమ చాలానే ఉంది’ అని కోహ్లీ ధ్వజమెత్తాడు.

తనను అభిమానించ మాత్రాన అతడిపై కోపం లేదని, భారత్‌లో ఉంటూ ఇండియన్ ప్లేయర్ల ఆటతీరును విమర్శించడం సరికాదని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

‘నీకు ఈ దేశం సరైంది కాదు’ అని బదులిచ్చాడు.


అయితే ఇప్పుడు దీనిపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

ఇతర దేశాల క్రికెటర్లను ఇష్టపడటం వ్యక్తిగత అభిప్రాయమని.ఆ మాత్రనికి దేశం వదిలి వెళ్లమని అనడం సరైంది కాదని నెటిజన్లు అంటున్నారు.

మీరు విదేశీ దుస్తులు ధరిస్తారు, విదేశంలో పెళ్లి చేసుకుంటారు, వీదేశీ భాషలో మాట్లాడుతారు.ఇవేవీ తప్పులు కాదు.

కానీ విదేశీ క్రికెటర్లను ఇష్టపడితే.మాత్రం దేశం వదిలిపోవాలా.? అని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube