ఆ విషయంలో రణవీర్ సింగ్ పై ఫ్యాన్స్ ఫైర్..!?  

susanth rajputh, ranveer singh, bollywood, social media, advertisement, Bingo Ad, Ranveer Singh, Sushanth Singh Rajput, - Telugu Advertisement, Bollywood, Ranveer Singh, Social Media, Susanth Rajputh

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరి బాలీవుడ్ స్టార్ల అభిమానుల మధ్య యుద్ధం జరుగుతుంది.ఇంతకీ ఎవరా హీరోలు అనుకుంటున్నారా.? వాళ్ళు మరెవరో కాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రణబీర్ కపూర్.ఇంతకీ అసలు గొడవ ఏంటి అనుకుంటున్నారా.? ఈ మధ్య రణబీర్ కపూర్ ఒక యాడ్ లో నటించారు.తాజాగా వ‌చ్చిన ఈ యాడ్‌లో ర‌ణ్‌వీర్ చెప్పిన ఒక డైలాగ్ సుశాంత్ ను ఉద్దేశించి చెప్పాడని సుశాంత్‌ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

TeluguStop.com - Fans Fire On Ranveer Singh In That Regard

సుశాంత్ ను అవమానించేలా డైలాగులు చెప్పాడని సుషాంత్ అభిమానులు, రణవీర్ సింగ్ పై మండిపడుతున్నారు.సుశాంత్‌కు ఫిజిక్స్ అంటే చాలా ఇష్ట‌మ‌న్న విష‌యం అత‌ని ఫ్యాన్స్‌కు బాగా తెలుసు.

అయితే ఈ తాజా యాడ్‌లో ర‌ణ్‌వీర్ ఓ భారీ ఫిజిక్స్ డైలాగ్ చెప్ప‌డం సుశాంత్ ఫ్యాన్స్‌కు న‌చ్చ‌డం లేదు.

TeluguStop.com - ఆ విషయంలో రణవీర్ సింగ్ పై ఫ్యాన్స్ ఫైర్..-General-Telugu-Telugu Tollywood Photo Image

చ‌నిపోయిన సుషాంత్ ఆత్మ‌కు కూడా మ‌న‌శ్శాంతిని ఇవ్వ‌కుండా చేస్తున్నారని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే మేము ఎమన్నా తక్కువ అంటూ ర‌ణ్‌వీర్‌సింగ్‌ అభిమానులు కూడా రివర్స్ లో సుషాంత్ ఫ్యాన్స్ కు దీటుగా సమాదానం చెప్పారు.అసలు ఎవ‌రు ఏం చేసినా దానిని సుశాంత్‌కు అవ‌మానంగానే భావించడం ఎంతవరకు సబబు అని ర‌ణ్‌వీర్ ఫ్యాన్స్ కౌంట‌ర్ వేస్తున్నారు.

అయితే త‌మ హీరోను కించపరచడానికే ర‌ణ్‌వీర్ ఇలా చేశాడ‌ని వాళ్లు ఆరోపిస్తున్నారు.ఒక అభిమాని అయితే .అస‌లు నీకు కాస్త‌యినా సిగ్గుందా అన్న రేంజ్‌లో ట్విట‌ర్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.సుశాంత్‌ను హేళ‌న చేయ‌డానికి వ‌చ్చిన ఏ అవ‌కాశాన్నీ కూడా మీరు వ‌దులుకోరా? క‌నీసం అత‌ని ఆత్మ‌కైనా కాస్త గౌర‌వం, మర్యాద ఇవ్వండి అంటూ ఆ అభిమాని సీరియ‌స్ అయ్యాడు.ఇంకా చాలా మంది మంది సుశాంత్ ఫ్యాన్స్ త‌మ ట్వీట్ల‌లో ర‌ణ్‌వీర్ యాడ్‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

కానీ రణవీర్ ఫాన్స్ మాత్రం వీళ్ల వాద‌న‌ను తిప్పి కొట్టే ప‌నిలో ఉన్నారు.సోషల్ మీడియాలో ఈ గొడవ గురించి తెలిసిన ఈ యాడ్ సృష్టిక‌ర్త బింగో.వెంట‌నే సీన్లోకి దిగి అభిమానులకు వివ‌ర‌ణ ఇచ్చింది.

మేము దివంగ‌త బాలీవుడ్ సెల‌బ్రిటీని అవ‌మానించామ‌ని వ‌స్తున్న వార్త‌లు అన్నీ అవాస్తవమని తెలిపారు.ఇలాంటి వాటిని ఎవరు పట్టించుకోవ‌ద్ద‌ని బింగో సంస్థ స్ప‌ష్టం చేసింది.

ఇకపై అభిమానులు సోషల్ మీడియాలో మాటలు యుద్దాన్ని మానేయాలని తెలిపారు.ఇప్పటికన్నా గొడవ సర్దుమనుగుతుందో లేదో చూడాలి మరి.

#Social Media #Susanth Rajputh #Advertisement #Ranveer Singh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fans Fire On Ranveer Singh In That Regard Related Telugu News,Photos/Pics,Images..