రోహిత్, కోహ్లీ జట్టులో లేకపోతే ఇదే జరుగుతుందని బీసీసీఐ పై ఫ్యాన్స్ ఫైర్..!

ప్రస్తుతం భారత్ లో ఉండే క్రికెట్ అభిమానులంతా బీసీసీఐపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.త్వరలో వన్డే వరల్డ్ కప్ జరుగుతుండగా ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తే రెండో వన్డే మ్యాచ్లో జరిగిన పరిస్థితులే రిపీట్ అవుతాయి తప్ప మరో ప్రయోజనం లేదని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

 Fans Fire On Bcci That If Rohit And Kohli Are Not In The Team, This Will Happen,-TeluguStop.com

మొదటి వన్డే మ్యాచ్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం పూర్తిగా వికటించింది.జట్టులో ఒక్క ఇషాన్ కిషన్( Ishan Kishan ) మినహా మిగిలిన వారంతా పేలవ ఆట ప్రదర్శన చేసేశారు.

తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ శర్మ మిగిలి ఉన్న కాస్త స్కోర్ అందించడంలో సహాయపడ్డాడు.ఇక విరాట్ కోహ్లీ అసలు బ్యాటింగ్ కే రాలేదు.

రెండో వన్డేలో రోహిత్, విరాట్లకు పూర్తిగా విశ్రాంతి ఇచ్చేశారు.

Telugu Hardik Pandya, Icc Cup, Ishan Kishan, Latest Telugu, Rohit Sharma, Virat

రెండో వన్డేలో కూడా ఇషాన్ కిషన్ మినహా మరెవరు రాణించలేకపోయారు.రెండో వన్డే మ్యాచ్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) అటు బ్యాటింగ్.ఇటు బౌలింగ్ లో పూర్తిగా విఫలమయ్యాడు.

Telugu Hardik Pandya, Icc Cup, Ishan Kishan, Latest Telugu, Rohit Sharma, Virat

అయితే మూడో వన్డే మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ శర్మ( Rohit sharma ) ఆడతారని తెలిసినప్పటికీ.వీరిద్దరూ లేకపోతే భారత జట్టు పసికూన జట్లపై కూడా గెలవడం కష్టమే అని స్పష్టంగా అర్థం అవుతుంది.వన్డే వరల్డ్ కప్ లో( ICC World Cup ) దాదాపుగా ప్రస్తుతం భారత జట్టులో ఉన్న సభ్యులే ఆడే అవకాశం ఉంది.కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అధిక అవకాశాలు ఇవ్వాలి కానీ ఇలా అనవసరంగా వాళ్లకు రెస్ట్ ఇచ్చి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పజెప్పడం పెద్ద తప్పు ,మిడిల్ ఆర్డర్ పూర్తిగా పేలవమైన బ్యాటింగ్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇకనైనా ప్రపంచ వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని అనవసర ప్రయోగాలు చేయకుండా పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగితేనే భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ట్రోఫి గెలుస్తుందనే నమ్మకం అభిమానులలో ఉంటుందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube