ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సర్ప్రైజ్ కోసం ఫాన్స్ వెయిటింగ్

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ సినిమాలో భాగం అయ్యారు.

 Fans Expecting Surprise For Ntr Birthday From Rrr Team-TeluguStop.com

అలాగే అలియా భట్, హాలీవుడ్ యాక్టర్స్ కూడా సినిమాలో నటిస్తున్నారు.దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా మీద భారీ క్రేజ్ ఉంది.

ఇప్పటికే సినిమా నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలని పరిచయం చేస్తూ గత ఏడాది రిలీజ్ చేసిన టీజర్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి.షూటింగ్ కూడా ముగింపు దశకి వచ్చేసింది.

 Fans Expecting Surprise For Ntr Birthday From Rrr Team-ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సర్ప్రైజ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది తెలియని విషయం.

ఇదిలా ఈ సినిమాని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయాలని ముందే డేట్ ఎనౌన్స్ చేశారు.అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంగా ఇంకా షూటింగ్ పార్ట్ కొంత మిగిలిపోయింది.

అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి.ఈ నేపధ్యంలో అక్టోబర్ రిలీజ్ కష్టమే అనే మాట వినిపిస్తుంది.

అయితే ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉంది.ఆ రోజు ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి తారక్ ఫ్యాన్స్ కి ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వడంతో పాటు రిలీజ్ డేట్ గురించి కూడా మళ్ళీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ బట్టి రిలీజ్ పోస్ట్ పోన్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.అయితే ఏదైనా సందర్భం చూసుకొని అఫీషియల్ గా చెబితే ఫాన్స్ కి కూడా సర్ప్రైజ్ ఇచ్చినట్లు అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్.

#Ram Charan #RRR Team #NTR Birthday #Rajamouli #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు