కాన్సర్ పేషెంట్స్ కి 'కౌశల్'ప్రైజ్ మనీ డొనేట్ చేయడంపై ఫాన్స్ డౌట్స్ ఇవే.? 50 లక్షలు కాకుండా ఇంకెంత వచ్చిందంటే.?     2018-10-06   11:36:17  IST  Sainath G

బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్ ముగిసింది. ఎన్నో అటంకాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొని విజేతగా కౌశల్ నిలిచారు. బిగ్‌బాస్‌లో ఉండగా బయట నుంచి కౌశల్ ఆర్మీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. దాంతో ఆయన సులభంగా పలు ఎలిమినేషన్ల గురించి బయటపడ్డారు. వెంకటేష్ గారి చేతులమీదుగా 50 లక్షల రూపాయల చెక్ అందుకున్నారు విన్నర్ కౌశల్. ఆ ప్రైజ్ మనీని కాన్సర్ తో బాధపడేవాళ్లకు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. తన తల్లి కాన్సర్ తో చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

కౌశల్ 50 లక్షలు డొనేట్ చేస్తా అనగానే ఫాన్స్ హ్యాపీ ఫీలయినప్పటికీ అసలు ఎలా ఇస్తాడనే దానిపై చర్చ నడుస్తోంది. త డబ్బు ఇచ్చేస్తానంటే, అంతకంటే ఎక్కువ సొమ్ము అతని దగ్గర ఉందా,అసలు ఈ సొమ్ము ఏవిధంగా అందిస్తాడు వంటి ప్రశ్నలను నెటిజ‌న్స్ లేవనెత్తుతున్నారు. అయితే బిగ్ బాస్ నుండి 50 లక్షలు మాత్రమే కాదు అంతకంటే ఎక్కువే కౌశల్ పొందాడని టాక్. యాల్టీ షోలో అన్ని రోజులు పాల్గొన్నందుకు ముందుగా మాట్లాడుకున్న ప్రకారం 8 లక్షలు, గ్రాండ్ ఫినాలేకి చేరినందుకు 5లక్షలు,బిగ్ బాస్ స్పాన్సర్స్ నుంచి 3 లక్షలు వచ్చాయని అంటున్నారు.

అయితే టాక్స్ లు పోను 50లక్షల్లో 46లక్షలు చేతికి వచ్చాయని అంటున్నారు. అయితే ఈ సొమ్ముని బ్యాంకు లో డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని తనను అడిగిన కాన్సర్ పేషేంట్స్ కి ఇస్తాడా, ఈ సొమ్ముని ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి, వచ్చే లాభాలోంచి సాయం చేస్తాడా అనేది చూడాలి. ఇక బిజినెస్ లో ఉండడం,టివి సీరియల్స్ లో నటించడం,బిగ్ బాస్ తెచ్చిపెట్టిన క్రేజ్ వల్ల సినిమాల్లో ఛాన్స్ లు రావడం ద్వారా కూడా కౌశల్ బానే సంపాదిస్తాడు.