అభిమానులను భయపెడుతున్న బాలయ్య  

Fans Doubt On Balakrishna Aghora Role - Telugu Balakrishna, Boyapati Srinu, Nbk106, Telugu Gossips, Telugu Movie News

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 106వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.రాజకీయాల కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బాలయ్య ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లోతెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Fans Doubt On Balakrishna Aghora Role - Telugu Balakrishna, Boyapati Srinu, Nbk106, Telugu Gossips, Telugu Movie News-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాతో మరోసారి తన మాస్ యాంగిల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బాలయ్య రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తాడనే వార్త గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో చెక్కర్లు కొడుతోంది.

అయితే ఈ పాత్ర బాలయ్యకు ఎంత మేర సెట్ అవుతుందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.అఘోరా పాత్రలో బాలయ్య లాంటి మాస్ యాక్టర్ ఎంతవరకు సూట్ అవుతాడని వారు ఆలోచిస్తు్న్నారు.

ఇక సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తాడనే ప్రచారం కూడా ఉండటంతో, ఈ సినిమాలో అఘోరా పాత్ర ఎలా ఉంటుందా అని వారు భయపడుతున్నారు.

ఏదేమైనా బాలయ్య చేయబోయే పాత్ర అప్పుడే హాట్ టాపిక్‌గా మారడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇప్పటికే అఫీషియల్‌గా ప్రారంభమైన ఈ సినిమా, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని బాలయ్య ఫ్యాన్స్ చూస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు