బిగ్ బాస్ విన్నర్ అతనే అంటున్న గూగుల్.. కానీ..?  

fans doing damage to bigg boss contestant abhijeet, Akkineni Nagarjuna, Abhijeet, Akhil, Monal, Sohel, harika, Lasya - Telugu Akkineni Nagarjuna, Bigg Boss Contestant Abhijeet, Bigg Boss Show, Morphed Google Image Goes Viral, Season 4

కరోనా, లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలు, యూట్యూబ్, టీవీ ఛానెళ్లపైనే ఆధారపడుతున్నారు.ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా ప్రసారమైన బిగ్ బాస్ షో నాలుగో సీజన్ నాగార్జున హోస్ట్ గా ప్రసారమవుతోంది.

TeluguStop.com - Fans Doing Damage To Bigg Boss Contestant Abhijeet

అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలడానికి చాలా సమయమే ఉన్నా బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

నిన్నటి నుండి గూగుల్ బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ అని చూపించినట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

TeluguStop.com - బిగ్ బాస్ విన్నర్ అతనే అంటున్న గూగుల్.. కానీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే గూగుల్ లో చెక్ చేస్తే మాత్రం అభిజిత్ పేరు చూపించడం లేదు.బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిజిత్ ఫ్యాన్స్ కావాలనే గూగుల్ ఇమేజ్ ను మార్ఫింగ్ చేశారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరి కొందరు మాత్రం గూగుల్ అభిజిత్ పేరును చూపించిందని తరువాత మార్చేసిందని చెబుతున్నారు.

అయితే వాస్తవం తెలీదు కాని ఇలాంటి ప్రచారాలు అభిజిత్ కు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయని బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ షోలో ఒక్క చిన్న తప్పు వల్ల ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఎంతోమంది ఉన్నారని అభిజిత్ గురించి ఇలా జరుగుతున్న ప్రచారం అతనికి న్యూట్రల్ ఆడియన్స్ ను దూరం చేస్తోందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.మరోవైపు లేజీగా ఉండే అభిజిత్ విన్నర్ ఏమిటని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.

మరోవైపు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి లాస్య లేదా మోనాల్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.లాస్య స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ ఆమె చేస్తున్న చిన్నచిన్న తప్పులు మైనస్ గా మారుతున్నాయి.

మోనాల్ కొన్ని వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సి ఉన్నా ఆమె అదృష్టం కొద్దీ హౌస్ లో కొనసాగుతోంది.లాస్య, మోనాల్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారా.? లేక ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా.? తెలియాలంటే ఆదివారం వారకు ఆగాల్సిందే.

#BiggBoss #MorphedGoogle #Season 4 #Bigg Boss Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fans Doing Damage To Bigg Boss Contestant Abhijeet Related Telugu News,Photos/Pics,Images..