సోనూసూద్‌ కు 'పద్మ' ఇవ్వాలంటూ నెట్టింట ట్రెండ్డింగ్‌

గత సంవత్సరం నుండి భారత దేశంలో సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రభుత్వాలు చేయడం లేదు అంటూ ఆయన అబిమానులు చెబుతున్నారు.వందల కోట్ల రూపాయలను ఆయన ఖర్చు చేస్తూ చేస్తున్న సేవా కార్యక్రమాలు గతంలో మరెవ్వరు కూడా చేయలేదని వారు అంటున్నారు.

 Fans Demanding Padma Award For Sonu Sood-TeluguStop.com

సోనూసూద్‌ వాదన నిజమే.ఆయన ఖచ్చితంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వాలు కూడా చేతులు ఎత్తేసిన సమయంలో తనవంతు సహకారంను అందిస్తున్నాడు.

ఆక్సీజన్‌ కావాలంటే వేలాది మందికి ఆక్సీజన్ అందించడంతో పాటు కొన్ని వేల మందికి ఔషదాలను అందించి వారి ప్రాణాలు కాపాడాడు.అలాంటి సోనూసూద్‌ ఖచ్చితంగా గొప్ప వ్యక్తి అనడంలో సందేహం లేదు.

 Fans Demanding Padma Award For Sonu Sood-సోనూసూద్‌ కు పద్మ’ ఇవ్వాలంటూ నెట్టింట ట్రెండ్డింగ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల సోనూసూద్‌ ప్రధాని కావాలంటూ కోరుకుంటున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు.ఇప్పుడు ఆయన కు పద్మ అవార్డు ఇవ్వాలంటూ నెట్టింట ప్రచారం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ అవార్డుల కోసం నామినేషన్‌ లను పంపించాల్సిందిగా ప్రకటన చేసింది.రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్థలు మరియు సాదారణ జనాలు కూడా పద్మ అవార్డల కోసం ప్రముఖులను నామినేట్‌ చేయవచ్చు.

అందుకే సోషల్‌ మీడియాలో కొన్ని వేల మంది సోనూ సూద్‌ కు పద్మ అవార్డు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

Telugu Bharata Ratna, Central Government, Padma Award For Sonu Sood, Padma Awards, Padma Bhushan, Real Hero Sonusood, Sonu Sood, Sonusood Corona Help, Sonusood Fans Demand-Movie

పద్మ భూషన్‌ అవార్డును సోనూ సూద్‌ కు ఇవ్వాలంటూ కొందరు నెట్టింట ట్రెండ్డింగ్‌ ను మొదలు పెడితే మరి కొందరు మాత్రం సోనూ సూద్‌ కు ఏకంగా భారత రత్న ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.సెప్టెంబర్ 15, 2021 వరకు పద్మ అవార్డు ల నామినీలను స్వీకరించబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.మరీ వచ్చే ఏడాది ఇవ్వబోతున్న పద్మ అవార్డుల జాబితాలో సోనూ సూద్‌ పేరు ఉంటుందా అనేది చూడాలి.

#Padma Bhushan #Sonu Sood #PadmaAward #Padma Awards #Bharata Ratna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు