ప్రశాంత్‌ భయ్యా.. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వొచ్చు కదా!

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం లో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా విడుదల గురించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ కూడా ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉంది.

 Fans Demand Prashanth Neel Announce Kgf 2 Release Date 2-TeluguStop.com

సినిమా ప్రమోషన్ మొదలు పెట్టాల్సి ఉండగా విడుదల ఉందా లేదా అనే అనుమానాలతో సినిమా మీడియాలో నిలిచింది.మొదట అనుకున్నదాని ప్రకారం అయితే కేజీఎఫ్‌ 2 ను వచ్చే నెలలోనే విడుదల చేయాల్సి ఉంది.

కాని పరిస్థితులు అనుకూలించక పోవడం వల్ల విడుదల చేసే అవకాశం లేదని అంటున్నారు.ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదు అన్నట్లుగానే మేకర్స్‌ వ్యవహరిస్తున్నారు.

 Fans Demand Prashanth Neel Announce Kgf 2 Release Date 2-ప్రశాంత్‌ భయ్యా.. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వొచ్చు కదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జూన్‌ చివరి వరకు పరిస్థితి కుదుట పడితే జులై లో థియేటర్లు ఓపెన్‌ అయితే సినిమా ను విడుదల చేస్తారేమో అనుకున్నారు.కాని ఇప్పటికే సినిమా విడుదల తేదీని మార్చేశారనే వార్తలు వస్తున్నాయి.

సినిమా ను విడుదల చేసేందుకు ఇది సరైన సమయం కాదని ఖచ్చితంగా వాయిదా వేసి తీరాల్సిందే అంటున్నారు.ఆగస్టులో పరిస్థితులు కుదుట పడితే తప్ప ఖచ్చితంగా మళ్లీ సినిమా ను వాయిదా వేయాల్సిందే అంటన్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను సెప్టెంబర్‌ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు వారాల్లో వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం సినిమా నిర్మాణం పూర్తి అయ్యింది కనుక విడుదల తేదీ ఏ సమయంలోనే ఉండే అవకాశం ఉంది.అభిమానులు ఈ విషమయై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ ఉంటే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నాడు.

ఆయన ప్రస్తుతం సలార్‌ సినిమా తదుపరి షెడ్యూల్‌ కు ఏర్పాట్లు చేస్తున్నాడట.ప్రేక్షకులు రిలీజ్ విషయంలో కిందా మీద అవుతున్న ఈ సమయంలో ఎందుకు ప్రశాంత్‌ నీల్‌ స్పందించడం లేదు అంటున్నారు.

నెట్టింట ప్రశాంత్‌ నీల్‌ ను భయ్యా రిలీజ్ విషయం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

#Covid Effect #KGF 2 #Kgf2Movie #FansDemand #Prashanth Neel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు