‘వినయ విధేయ రామ’ ఫస్ట్‌లుక్‌ పై ఎక్కువ శాతం ఫ్యాన్స్‌ స్పందన ఇది   Fans Comments On Vinaya Vidheya Rama Movie Teaser     2018-11-08   12:26:59  IST  Ramesh P

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కు ఈ క్లాస్‌ టైటిల్‌ పెట్టడంపై సినీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక చిత్రం టైటిల్‌ విషయంలో కూడా ఇదే తరహా వాదన వచ్చింది. అప్పుడు బోయపాటి నిర్ణయాన్ని సినిమా విడుదలైన తర్వాత అంతా సమర్థించారు. ఇప్పుడు కూడా టైటిల్‌ విషయంలో అదే జరుగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

టైటిల్‌ విషయాన్ని పక్కన పెడితే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ స్టిల్‌ విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా ఫస్ట్‌లుక్‌ అంతగా ఆకట్టుకోలేక పోయింది, మెగా ఫ్యాన్స్‌ సంతృప్తి చెందడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఫస్ట్‌లుక్‌ కు మొదట వేరే స్టిల్‌ అనుకున్నారట. కాని ఫస్ట్‌లుక్‌ నిర్ణయాన్ని చరణ్‌ మరియు చిరంజీవి తీసుకోవడం వల్ల ఆ స్టిల్‌ నో అంటూ ఈ స్టిల్‌ను ఫైనల్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. చరణ్‌ మూవీ ఫస్ట్‌లుక్‌పై మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Fans Comments On Vinaya Vidheya Rama Movie Teaser-

ఫస్ట్‌లుక్‌ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరగాల్సింది పోయి మెగా ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ ఫ్యాన్స్‌ చరణ్‌ లుక్‌పై సంతృప్తి చెదడం లేదు. అయితే సినిమా విడుదలకు ముందు ఇంకా టీజర్‌, ట్రైలర్‌ పోస్టర్స్‌ వస్తాయి కనుక ఈ ఫస్ట్‌లుక్‌ విషయంలో టెన్షన్‌ అవసరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.