సీక్వెల్ కోసం వెళ్తే మళ్లి మొదటి పార్ట్ చూపించాడు ..ఏందయ్యా సిద్దు ?

గతవారం విడుదలైన సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) మోస్ట్ అవైటెడ్ మూవీ డీజే టిల్లు స్క్వేర్ థియేటర్స్ లో విడుదలై సందడి చేస్తోంది.ఈ సినిమా గురించి చాలామంది బాగా మాట్లాడుతున్నారు.

 Fans Comments On Tillu Square Movie,dj Tillu,tillu Square,anupama Parameswaran,s-TeluguStop.com

సినిమాలోని వన్ లైన్ పంచులు అదిరిపోయాయి అని అద్భుతంగా తెరకెక్కించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ అనుపమ( Anupama Parameswaran ) అందాల ప్రదర్శన కోసం బోల్డ్ సీన్స్ కోసం కూడా ఆడియన్స్ క్రేజీగా వెయిట్ చేశారు.

అనుకున్న విధంగానే థియేటర్స్ లో విడుదలైన మొదటి రోజు నుంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకుని ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే రాబట్టింది.కానీ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్న వారు ఒక వర్గం వారు మాత్రమే.

మరొక వర్గం వారు డీజే టిల్లు స్క్వేర్ సినిమా( DJ Tillu Square ) చూడటానికి వెళితే మళ్ళీ మొదటి భాగాన్నే వేసి చూపించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Costumes, Dj Tillu, Story, Tillu Square-Movie

పేరుకే ఈ చిత్రంలో హీరోయిన్ మాత్రం మారింది కానీ మిగతా విషయాలు దాదాపు అన్ని సేమ్ ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.చాలా సీన్స్ రిపీటెడ్ గా( Repeated Scenes ) పెట్టడం, అలాగే పాటలు కూడా ఒకటి రెండు సార్లు మొదటి భాగంలోని వాటిని రిపీట్ చేయడం, కాస్ట్యూమ్స్ కూడా దాదాపు ఇంచుమించు మొదటి భాగం తరహా లోనే ఉండటం, కొన్నిసార్లు మొదటి పార్ట్ కాస్ట్యూమ్స్( Costumes ) ని వాడటం కూడా ఈ కామెంట్స్ కి కారణం అయ్యాయి.కొన్ని వన్ లైన్ పంచులు కూడా రిపీట్ చేయడం వెనక దర్శకుని ఉద్దేశం ఏంటో తెలియదు కానీ చాలా వరకు మొదటి సినిమాను చూసిన ఫీలింగ్ తోనే ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు.

Telugu Costumes, Dj Tillu, Story, Tillu Square-Movie

ఇక మొదటి పార్ట్ తరహా లోనే రెండవ భాగంలోనూ మొదట అమాయకంగా ఉన్నట్టుగా హీరో కనిపించడం, ఆ తర్వాత హీరోయిన్ లో మరో యాంగిల్ ని చూపించడం, మొత్తంగా హీరోయిన్ ఈ చిత్రానికి విలన్ గా( Villain ) మారడం లాంటి అంశాలు ఇంచుమించు సేమ్ ఉన్నాయి.భవిష్యత్తులో మరికొన్ని పార్ట్స్ గా ఈ సినిమాను నిర్మించబోతున్నారు కాబట్టి ముందు ముందు అయినా ఈ లోపాలను సరిచేసుకుని సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.ఏది ఏమైనా ఈ లోపాలను పెద్దగా పట్టించుకోకుండా థియేటర్ కి వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube