పవన్‌కు దెబ్బేస్తున్నది వారేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ను జరుపుకుంటోంది.లాక్‌ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగ్ తాజాగా జరుపుకుంటుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Fans Becoming Dangerous To Pawan Kalyan, Pawan Kalyan, Fans, Vakeel Saab, Tollyw-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.కాగా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘పింక్’కు రీమేక్‌గా వకీల్ సాబ్ వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ఈ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ తమ హీరో పాలిట విలన్లుగా మారుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుండి లీక్ అవుతున్న ఫోటోలను అదేపనిగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ప్రేక్షకుల్లో తగ్గుతుందని పవన్ భావిస్తున్నాడట.అయితే సెట్స్ నుండి ఫోటోలు లీక్ అవుతుంటే సదరు చిత్ర టెక్నీషియన్లు ఏం చేస్తున్నారంటూ పవన్ వారిపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

గతంలోనే తన అభిమానుల అత్యుత్సాహం పవన్ సినిమాలను దెబ్బేసిందని పవన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు.

ఇప్పుడు మరోసారి ఇదే పంథా కొనసాగుతుండటంతో, తన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పవన్ వారికి సూచిస్తున్నాడట.

వారు బాధ్యతగా వ్యవహరించి ఈ లీకులను అడ్డుకోవాల్సిందిగా పవన్ కోరుతున్నాడట.అయితే తమ అభిమాన హీరో చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకు వచ్చినా వెంటనే తాము అడ్డుకుంటామని, అది సోషల్ మీడియాలో వైరల్ కాకముందే దాన్ని తొలిగించేందుకు ప్రయత్నం చేస్తామంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

ఇక వకీల్ సాబ్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్, చిత్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube