మహేష్ రెస్టారెంట్ పై విమర్శలు చేసేవాళ్లకు ఫ్యాన్స్ జవాబిదే.. ఏమన్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య పేరుపై ఏఎన్ రెస్టారెంట్ పేరుతో ఒక రెస్టారెంట్ ఓపెన్ కాగా ఈ రెస్టారెంట్ రేట్లపై విమర్శలు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.మహేష్ రెస్టారెంట్ లో వంటకాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Fans Answer To Negative Comments About Mahesh Restaurent Details, Mahesh Babu, M-TeluguStop.com

అయితే నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు మహేష్ అభిమానులు కూడా ధీటుగా జవాబిస్తున్నారు.ఏఎన్ రెస్టారెంట్ మెనూ ఇతర రెస్టారెంట్లతో పోల్చి చూస్తే బెటర్ గానే ఉందని కామెంట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ లోని ఖరీదైన ఏరియాలో ఈ రెస్టారెంట్ ను ఓపెన్ చేశారని అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చైందని ఫ్యాన్స్ వెల్లడించారు.మహేష్, నమ్రతల బ్రాండ్ తో ఓపెన్ అయిన రెస్టారెంట్ కావడంతో ఈ రెస్టారెంట్ మెయింటనెన్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని ఈ రెస్టారెంట్ లో పని చేసేవాళ్లకు ఇచ్చే వేతనాలు కూడా ఎక్కువ మొత్తమేనని అభిమానులు చెబుతున్నారు.

ఇతర హోటళ్లతో ఈ రెస్టారెంట్ ను పోల్చవద్దని మహేష్ తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాడని గుర్తుంచుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Telugu Restaurant, Mahesh Babu, Maheshbabu, Namratha-Movie

ఇతర రెస్టారెంట్లలో రేట్లు కూడా చూసి కామెంట్లు చేయాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.మహేష్ సెలబ్రిటీ కాబట్టే ఆయన రెస్టారెంట్ గురించి కామెంట్లు చేస్తున్నారని వేరే వాళ్ల రెస్టారెంట్ అయితే రేట్ల గురించి ఇలాంటి కామెంట్లు చేసేవారా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

Telugu Restaurant, Mahesh Babu, Maheshbabu, Namratha-Movie

ఇష్టమైన వాళ్లు తింటారని కష్టమైన వాళ్లు మానుకుంటారని తన రెస్టారెంట్ లో కచ్చితంగా తినాలని మహేష్ కానీ నమ్రత కానీ బలవంతం చేయలేదు కదా అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు.లగ్జరీ రెస్టారెంట్లలోని రేట్లను మిగతావాటితో పోల్చడం సరికాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.మహేష్ నమ్రతల బ్రాండ్ తో నడుస్తున్న రెస్టారెంట్ కాబట్టి ఆ రేట్లలో తప్పు లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube