కమెడియన్‌ మృతి వివాదం రాజుకుంటుంది... సమాధానం చెప్పాలంటున్న కోలీవుడ్‌

తమిళ కమెడియన్‌ వివేక్‌ మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆయన మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉండి ఉన్నట్లుండి గుండె పోటు రావడం ఏంటీ.

 Fans And Tamil Film Industry People Comments On Vivek Death-TeluguStop.com

మొదటి సారి గుండె పోటుకే చనిపోవడం ఏంటీ అంటూ తమిళ సినీ వర్గాల వారు మరియు ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నిజాలు బయటకు రాకుండా చూస్తున్నారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

తమిళ నటులు కొందరు వివేక్ రెండు రోజుల క్రితం వ్యాక్సిన్ తీసుకున్నాడు.వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఆయన మృతి చెంది ఉంటాడు అంటున్నారు.

 Fans And Tamil Film Industry People Comments On Vivek Death-కమెడియన్‌ మృతి వివాదం రాజుకుంటుంది… సమాధానం చెప్పాలంటున్న కోలీవుడ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొందరికి వ్యాక్సిన్ వికటిస్తుంది.అది వివేక్ విషయంలో జరిగింది.

వెంటనే స్పందించక పోవడం వల్లే వివేక్‌ మృతి చెందాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కరోనా వ్యాక్సిన్‌ ను తీసుకుంటున్న ప్రతి ఒక్కరి గురించి శ్రద్ద చూపించేందుకు ప్రభుత్వాలు ఒక డేటా బేస్ ను మెయింటెన్ చేస్తున్నాయి.

కాని వివేక్ మృతి కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ వారు స్పందించడం లేదు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల్లోనే హార్ట్‌ ఎటాక్‌ రావడం అంటే ఖచ్చితంగా అది వ్యాక్సిన్‌ వికటిచడం వల్లే అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో తమిళ సినీ అభిమానులు మరియు సినీ ప్రముఖులు అంతా కూడా వివేక్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లే అలా జరిగిందేమో అనే అనుమానంను వ్యక్తం చేస్తున్నారు.అనారోగ్య సమస్యలు ఉన్న వారు వ్యాక్సిన్‌ ను తీసుకోవడం వల్ల ప్రమాదం అంటూ వార్తలు వస్తున్నాయి.

వివేక్ అనారోగ్య సమస్యల గురించి పట్టించుకోకుండానే ఆయనకు వ్యాక్సిన్‌ ఇచ్చారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివేక్‌ మృతి పై సమగ్ర విచారణ జరగాల్సిందే అంటూ తమిళ నటుల సంఘం కార్యదర్శి డిమాండ్ చేశారు.

ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుండో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.

#Vivek #Kollywood #Corona #Tamil Comedian

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు