ప్రభాస్ లాటరీ స్టార్ అంటూ ఆ హీరో ఫ్యాన్స్ కామెంట్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమన్నారంటే?

స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.అయితే బాహుబలి సిరీస్ వల్ల ప్రభాస్ మార్కెట్ పెరిగింది.

 Fan War Begins Again In Tollywood And Allu Arjun Fans Called Prabhas As Lottery Star , Fan War ,interesting Facts , Lottery Star , Prabas , Allu Arjun , Puspa , Sahoo-TeluguStop.com

ప్రభాస్ కు బాహుబలి సిరీస్ అన్ని విధాలుగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.బాహుబలి సిరీస్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కళ్లు చెదిరే కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమాకు కూడా బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 Fan War Begins Again In Tollywood And Allu Arjun Fans Called Prabhas As Lottery Star , Fan War ,interesting Facts , Lottery Star , Prabas , Allu Arjun , Puspa , Sahoo-ప్రభాస్ లాటరీ స్టార్ అంటూ ఆ హీరో ఫ్యాన్స్ కామెంట్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమన్నారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజమౌళి సపోర్ట్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ లో నమ్మకం ఉంది.

పుష్ప సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో బన్నీకి సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది.అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ ప్రభాస్ లాటరీ స్టార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప ది రైజ్ అంచనాలను మించి కలెక్షన్లు సాధించిందని బన్నీ మాత్రమే రియల్ స్టార్ అని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Telugu Allu Arjun, Fan War, Lottery, Prabhas, Puspa, Sahoo-Movie

బన్నీ పూర్తిస్థాయిలో ఆల్ రౌండర్ అని ప్రభాస్ ఆల్ రౌండర్ కాదని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. బన్నీ, అల్లు అర్జున్ మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా అభిమానులు మాత్రం గొడవలు పడుతూ సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.పుష్ప హిందీ కలెక్షన్లు ప్రభాస్ సినిమా తొలిరోజు కలెక్షన్లంత కూడా లేవని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

సాహో సినిమా బాలీవుడ్ కలెక్షన్లను చూసి బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.స్టార్ హీరోలు ఈ సోషల్ మీడియా వార్ కు చెక్ పెడితే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube