ఫాన్స్ కి రిప్లై ఇయ్యవా.? అయినా లవ్ యు అంటూ అభిమాని ట్వీట్.! సమంత హైలైట్ రిప్లై.!       2018-07-09   00:35:11  IST  Raghu V

నటి సమంతకి ఉన్న ఫ్యాన్ ఫోలివింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఏం మాయ చేసావేతోనే మాయ చేసి కుర్రాళ్లందరిని తన అందంతో కట్టిపడేసింది. అక్కినేని కోడలిగా వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇటీవలే సమంతకు సంబందించిన ఒక వార్తా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె నటనకు గుడ్ బాయ్ చెప్పబోతున్నారంట.? మరి ఇది ఎంత వరకు నిజమో తెలీదు. ఇది ఇలా ఉంటె ఇటీవలే ఆమెకు ట్విట్టర్ లో ఓ అభిమాని పెద్ద షాక్ ఇచ్చాడు.

సమంత సమయం దొరికినప్పుడల్లా ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ట్విట్టర్‌లో సమంతకు అభిమానుల ఫాలోయింగ్‌ అధికస్థాయిలోనే ఉంది. తంటా ఎక్కడొచ్చిందంటే స్నేహితులు, సినిమా వాళ్ల ప్రశ్నలకే తప్ప సమంత అభిమానులకు బదులివ్వడం లేదట.

- Telugu

ఇలాంటి పరిస్థితుల్లో ఒక వీరాభిమాని కాస్త ఘాటుగానే ప్రశ్నించాడు. అదేమిటంటే తాను ఇప్పటి వరకూ వేలకు పైగా మీకు ట్వీట్‌ చేశానని, మీరు మాత్రం ఒక్కసారి కూడా బదులివ్వలేదని నిష్టూరమాడాడు. అంతే కాదు అయిన మీపై అభిమానం ఒక్క శాతం కూడా తగ్గలేదంటూ, ధైర్యంగా ఐలవ్యూ అని కూడా చెప్పేశాడు. దీంతో షాక్‌ అవడం సమంత వంతైంది. ఆ తరువాత తేరుకుని తనకు వెయ్యికి పైగా మెసేజ్‌లు చేసినందుకు కృతజ్ఞతలు అని ఆ అభిమానికి బదులిచ్చారు. అంతే తనకు సమంత టీట్‌ చేయడంతో ఆ అభిమాని ఆనందంతో ఎగిరి గంతేశాడు. నేను జయించాను. ఎంతో సాధించాన న్న ఫీలింగ్‌ కలుగుతోంది అంటూ ఫుల్‌ జోష్‌లో మునిగిపోయాడు. అభిమానం అంటే ఇదే.